హోటల్‌లో ఉన్న young woman.. కాసేపటికి కారులో ప్రత్యక్షం.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. అని ప్రియుడిని అడగడంతో..

ABN , First Publish Date - 2022-08-16T22:26:27+05:30 IST

ఓ యువతికి విహారయాత్రలో (Excursion) యువకుడు పరిచయమయ్యాడు. పదే పదే తననే చూస్తుండడంతో మొదట సందేహించింది. అయితే తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. అనంతరం..

హోటల్‌లో ఉన్న young woman.. కాసేపటికి కారులో ప్రత్యక్షం.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. అని ప్రియుడిని అడగడంతో..

ఓ యువతికి విహారయాత్రలో (Excursion) యువకుడు పరిచయమయ్యాడు. పదే పదే తననే చూస్తుండడంతో మొదట సందేహించింది. అయితే తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. అనంతరం వారి మధ్య ప్రేమ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఓ రోజు ప్రియుడు పిలవడంతో హోటల్ వెళ్లిన యువతి.. కాసేపటికి కారులో ప్రత్యక్షమైంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. అంటూ ప్రియుడిని అడిగింది. అతడి సమాధానానికి ఆమెకు కంగారు మొదలైంది. పదే పదే నిలదీయడంతో బెదిరించి మరీ దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం గ్వాలియర్ పరిధి కంటోన్మెంట్ పరిధికి చెందిన 22ఏళ్ల యువతి.. 2020లో స్నేహితులతో కలిసి విహారయాత్ర నిమిత్తం కోట ప్రాంతానికి వెళ్లింది. అక్కడ, జైపూర్ పరిధి జోత్‌బారా ప్రాంతానికి చెందిన వికాస్ అనే వ్యక్తి.. యువతిని పదే పదే చూస్తుండేవాడు. దీంతో ఆమెకు మొదట అతడిపై సందేహం కలిగింది. అయితే యాత్ర ముగిసేలోపు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో.. తన తల్లిదండ్రులను ఒప్పించమని చెప్పింది. 

Engagement పంక్షన్‌లోకి వచ్చి.. యువకుడి ముక్కు, చెవులు కట్ చేసిన బంధువులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..


ఈ క్రమంలో ఓ రోజు అర్జంట్‌గా మాట్లాడాలంటూ యువతికి ఫోన్ చేసి హోటల్‌కు పిలిచాడు. మాట్లాడే క్రమంలో ఆమెకు శీతలపానీయం (Narcotic soft drink) ఇచ్చాడు. అది తాగిన కాసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి (unconsciousness) వెళ్లింది. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చి చూస్తే కారులో ఉంది. దీంతో ఎక్కడికి వెళ్తున్నాం.. అని ప్రియుడిని అడిగింది. అతను ముంబై అని చెప్పడంతో ఒక్కసారిగా కంగారుపడింది. కారు దిగి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో చంపేస్తానని బెదిరించి మరీ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత జైపూర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి కొన్నాళ్లు అక్కడే బంధించాడు.

girlfriend పుట్టింటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమెకు ఫోన్‌లోని వీడియోలను చూపించిన అనంతరం..


అయితే అప్పటికే వికాస్‌‌కు భార్య, పిల్లలు ఉన్నారని తెలిసి యువతి షాక్ అయింది. తర్వాత ఆమెను వివిధ ప్రాంతాలకు మారుస్తూ.. రెండేళ్ల పాటు తన వద్దే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. ఇటీవల అతడి వద్ద నుంచి ఎలాగోలా తప్పించుకుని సొంతూరుకు వచ్చేసింది. అయినా ఆమెను వదలని వికాస్.. ఆమె ఇంటికి వెళ్లి కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లాడు. యువతి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వికాస్ కోసం గాలిస్తున్నారు.

Shocking incident: జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. వారి కోసం ఎదురు చూస్తున్న తల్లి.. తలుపులు తీసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా..Read more