Viral Video: వధూవరుల రొమాంటిక్ వెడ్డింగ్ షూట్.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ABN , First Publish Date - 2022-12-28T16:31:12+05:30 IST

పెళ్లిళ్ల సీజన్ అయినా, కాకపోయినా, ప్రతిరోజూ సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోలు హృదయాలను గెలుచుకుంటాయి. మరికొన్ని వీడియోలు ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: వధూవరుల రొమాంటిక్ వెడ్డింగ్ షూట్.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..

పెళ్లిళ్ల సీజన్ అయినా, కాకపోయినా, ప్రతిరోజూ సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు (Wedding Videos) వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోలు హృదయాలను గెలుచుకుంటాయి. మరికొన్ని వీడియోలు ఫన్నీగా ఉండి నవ్వు (Funny Videos) తెప్పిస్తాయి. ప్రస్తుతం పెళ్లికి ముందు వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూట్ (Wedding shoot) అంటూ ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో వధూవరులు రొమాంటిక్ స్టైల్‌లో వెడ్డింగ్ పోజులు ఇస్తున్నారు. వధూవరులు వేదికపై డ్యాన్స్ చేస్తూ రొమాంటిక్ స్టిల్స్ ఇస్తున్నారు. అయితే ఆ సమయంలో వధువు జారి కింద పడిపోయింది. దాంతో వధూవరులతో పాటు అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 90 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. 5 లక్షల 45 వేల మందికి పైగా దీన్ని లైక్ చేశారు.

Updated Date - 2022-12-28T16:31:14+05:30 IST