Viral Video: పెళ్లి వేదికపైనే వధూవరుల ఫైటింగ్‌.. కారణమేంటో తెలిస్తే నవ్వు రాక తప్పదు!

ABN , First Publish Date - 2022-12-13T19:49:14+05:30 IST

సోషల్ మీడియాలో వివాహాలకు సంబంధించిన వీడియోలు (Wedding Videos) తరచుగా వైరల్ అవుతుంటాయి. పెళ్లిలో జరిగే ఫన్నీ ఘటనలు, షాకింగ్ సన్నివేశాలకు సంబంధించే వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో ఇంటర్నెట్‌లో (Viral Video) హల్‌చల్ చేస్తోంది.

Viral Video: పెళ్లి వేదికపైనే వధూవరుల ఫైటింగ్‌.. కారణమేంటో తెలిస్తే నవ్వు రాక తప్పదు!

సోషల్ మీడియాలో వివాహాలకు సంబంధించిన వీడియోలు (Wedding Videos) తరచుగా వైరల్ అవుతుంటాయి. పెళ్లిలో జరిగే ఫన్నీ ఘటనలు, షాకింగ్ సన్నివేశాలకు సంబంధించే వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో ఇంటర్నెట్‌లో (Viral Video) హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో వధూవరులు పెళ్లి వేదిక మీదే ఫైటింగ్ చేసుకున్నారు. చిన్న కారణానికే ఒకరినొకరు కొట్టుకున్నారు. వారు ఎందుకు కొట్టుకున్నారో చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

ఆ వీడియోలో.. వరుడు బలవంతంగా వధువుకు మిఠాయి తినిపించేందుకు ప్రయత్నించాడు. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా స్వీట్ పెడుతుండడంతో వరుడి చేతిని వధువు దూరంగా తోసి అతడిని చెంపపై కొట్టింది. దీంతో వరుడు కూడా కోపోద్రిక్తుడై వధువును కొట్టాడు. ఆ తర్వాత వధూవరులు జుట్టు పట్టుకుని (Bride and groom fight on the Wedding stage) మరీ కొట్టుకున్నారు. ఈ వీడియోకు (Trending Video) ఇప్పటి వరకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. అలాగే వేలమంది నెటిజన్లు లైకులు కురిపించారు. ఈ ఫన్నీ వీడియోపై (Funny Video) నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T19:49:16+05:30 IST