Viral Video: 30వేల అడుగుల ఎత్తులో విమానం.. ఇద్దరు వ్యక్తులు చేసిన పనికి ప్రయాణికులు షాక్..
ABN , First Publish Date - 2022-12-16T08:52:13+05:30 IST
గొడవలు చాలా కామన్. వీటిని ఎక్కడో చోట నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ.. అదే గొడవ భూమికి 30వేల అడుగుల ఎత్తులో జరిగితే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాంటి..
ఇంటర్నెట్ డెస్క్: గొడవలు చాలా కామన్. వీటిని ఎక్కడో చోట నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ.. అదే గొడవ భూమికి 30వేల అడుగుల ఎత్తులో జరిగితే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాంటి గొడవకు సంబంధించిన వీడియో(Video)నే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఎగబడి మరీ చూస్తూన్నారు. అంతేకాదూ ఆ గొడవపై స్పందిస్తూ.. కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
విమానం(Fight in Flight) ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో సమాచారం లేదు కానీ వీడియోలోని దృశ్యాల ప్రకారం.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. కూర్చున్న సీట్లోంచి లేచి, తన ముందు వరుసలో కూర్చున్న మరో వ్యక్తితో గొడవకు దిగాడు. దీంతో తోటి ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు. వెంటనే మధ్యలో కలగజేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కొందరు ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఇలా తీసిన వీడియోను తనను తాను ఫైలెట్గా ట్విట్టర్(Twitter)లో ప్రకటించుకున్న మెక్ ఆడమ్స్ అనే వ్యక్తి ‘ఢిల్లీ డ్యూడ్’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్గా మారింది. లక్షలాది మంది వీక్షించారు.