తనను దూరం పెడుతోందనే కారణంతో ప్రేయసిని గోవా తీసుకెళ్లాడు.. బీచ్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం.. మరుసటి రోజు చూస్తే..

ABN , First Publish Date - 2022-05-21T20:36:48+05:30 IST

ప్రేమలో ఉండే యువతీయువకుల మధ్య మొదట ఎలాంటి సమస్యలూ ఉండవు. ఒకరిపై ఒకరు ప్రేమ చూపుతూ అన్యోన్యంగా ఉంటారు. ఒక్కరోజు ఎడబాటును కూడా భరించలేరు...

తనను దూరం పెడుతోందనే కారణంతో ప్రేయసిని గోవా తీసుకెళ్లాడు.. బీచ్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం.. మరుసటి రోజు చూస్తే..

ప్రేమలో ఉండే యువతీయువకుల మధ్య మొదట ఎలాంటి సమస్యలూ ఉండవు. ఒకరిపై ఒకరు ప్రేమ చూపుతూ అన్యోన్యంగా ఉంటారు. ఒక్కరోజు ఎడబాటును కూడా భరించలేరు. అయితే కొందరు ప్రేమికుల విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. గోవాలో ఓ ప్రేమ జంట విషయంలో ఇలాగే జరిగింది. తనను దూరం పెడుతోందనే కారణంతో ప్రేయసిని గోవా తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బీచ్‌లో ఉండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు జరిగిన ఘటన తెలుసుకుని అంతా షాక్ అయ్యారు..


గోవాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పనాజీ పరిధిలోని కొత్త వడ్డెం అనే ప్రాంతానికి చెందిన దియా(19) అనే యువతి, కలం గుట్కర్ అనే యువకుడి మధ్య కళశాలలో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. మొదట్లో ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య ప్రేమ ఉండేది. అయితే ఏమైందో ఏమో తెలీదుగానీ.. ఉన్నట్టుండి ఆ యువతి కలం గుట్కర్‌ను దూరం పెట్టడం మొదలెట్టింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించేది కాదు. దీంతో ఆ యువకుడు ప్రేయసిపై పగ పెంచుకున్నాడు.

ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులు కూడా కాకముందే ఓ యువకుడి బలవన్మరణం.. తండ్రికి చివరగా వాట్సప్‌లో పంపిన మెసేజ్‌లో..


ఈ క్రమంలో గత బుధవారం ఆమెతో ప్రేమగా మాట్లాడి.. గోవాకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ సరదాగా గడిపారు. వెల్సన్ బీచ్‌లో సరదగా గడుపుతున్న సమయంలో మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన కలం గుట్కర్.. కత్తితో తన ప్రియురాలిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గురువారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

5 నెలల క్రితం పెళ్లి.. డాబాపై పడుకుని పొద్దునే కొడుకు, కోడల్ని లేపేందుకు వస్తే గదిలో కనిపించిన దృశ్యం చూసి..!

Read more