తల ఒకచోట.. మొండెం మరో చోట.. ఒకే ఒక్క అనుమానం.. ఈ 55 ఏళ్ల వ్యక్తి మరణానికి కారణమయింది.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2022-09-16T02:04:22+05:30 IST

అనుమానాలు ఒక్కోసారి హత్యలకు దారి తీస్తుంటాయి. చివరకు బాధితులు ఎలాంటి తప్పులూ చేయలేదని తెలుస్తుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. క్షణికావేశంలో..

తల ఒకచోట.. మొండెం మరో చోట.. ఒకే ఒక్క అనుమానం.. ఈ 55 ఏళ్ల వ్యక్తి మరణానికి కారణమయింది.. అసలేం జరిగిందంటే..!

అనుమానాలు ఒక్కోసారి హత్యలకు దారి తీస్తుంటాయి. చివరకు బాధితులు ఎలాంటి తప్పులూ చేయలేదని తెలుస్తుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కారణంగా చివరకు తాము జైలుపాలవడమే కాకుండా.. ఎదుటి వారికి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఛత్తీస్‌గఢ్‌‌లో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. 55ఏళ్ల వ్యక్తిని చంపేసి.. తల ఓ చోట, మొండాన్ని మరోచోట పడేశారు. పోలీసులు విచారణలో చివరకు షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) దంతేవాడ జిల్లా గామవాడ పరిధి ముండ్ర పారా అనే ప్రాంతంలో నాగదురం భాస్కర్ (55).. భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇదిలావుండగా, ఇదే గ్రామానికి చెందిన కమ్లు భాస్కర్ అనే యువకుడు, భాస్కర్ మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కమ్లు భాస్కర్ కుటుంబంలో పలువురు అనారోగ్యానికి గురయ్యారు. నాగదురం భాస్కర్ చేతబడి (sorcery) చేయడం వల్లే ఇలా జరుగుతోందని.. యువకుడు కోపం పెంచుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నాగదురం భాస్కర్.. భార్యతో కలిసి దంతెవాడ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌కు బయలుదేరాడు.

పిల్లలను స్కూలుకు పంపించి వచ్చే లోపే.. భార్యను ప్రియుడే చంపేశాడంటూ ఏడుస్తూ చెప్పిన భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


అయితే మార్గమధ్యలో భార్యను ఒక్కదాన్నే మార్కెట్‌కు పంపి.. తాను వేరే పని మీద ఆగిపోయాడు. అయితే అప్పటికే యువకుడు.. నాగదురం భాస్కర్‌ను అనుసరిస్తూ వెళ్తున్నాడు. నిర్మానుష్య ప్రదేశంలో ఒక్కసారిగా భాస్కర్‌పై దాడి చేశాడు. నోరు మూసి, గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత తల ఒకటోట, మొండాన్ని మరోచోట పడేసి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతుడికి యువకుడితో జరిగిన గొడవ గురించి తెలిసింది. దీంతో చివరకు నిందితుడిని అదుపులోకి విచారించగా నేరం అంగీకరించాడు.

4 నెలల క్రితం పెళ్లి.. భార్యను పడుకోమని చెప్పి.. చదువుకుంటానంటూ మరో గదిలోకి వెళ్లిన భర్త.. తెల్లవారుజామున ఆమె వెళ్లి చూస్తే..Read more