అక్కా! నీతో మాట్లాడాలి.. అంటూ కారులో ఊరి బయటకు తీసుకెళ్లాడు.. తన మాటకు అభ్యంతరం చెప్పడంతో చివరకు..

ABN , First Publish Date - 2022-09-19T02:25:31+05:30 IST

భర్త, అత్తమామల నుంచి సమస్యలు ఎదురైన సమయంలో.. పుట్టింటి వారు ఉన్నారనే ధైర్యంతో ఉంటారు. అత్తింట్లో చిత్రహింసలు మరీ ఎక్కువైన సమయంలో చివరకు తల్లిదండ్రులు..

అక్కా! నీతో మాట్లాడాలి.. అంటూ కారులో ఊరి బయటకు తీసుకెళ్లాడు.. తన మాటకు అభ్యంతరం చెప్పడంతో చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

భర్త, అత్తమామల నుంచి సమస్యలు ఎదురైన సమయంలో.. పుట్టింటి వారు ఉన్నారనే ధైర్యంతో ఉంటారు. అత్తింట్లో చిత్రహింసలు మరీ ఎక్కువైన సమయంలో చివరకు తల్లిదండ్రులు, అన్నాతమ్ముళ్ల ఎదుట తన బాధను వెళ్లబోసుకుంటారు. అలాగే పుట్టింటి వారు కూడా తమ కూతురు సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంటారు. అయితే కర్నాటకలో మాత్రం ఓ మహిళ విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. తమ్ముడే కదా అని నమ్మినందుకు తన ప్రాణాలనే పోగొట్టుకోవాల్సి వచ్చింది. అక్కా! నీతో మాట్లాడాలంటూ ఊరి బయటకు తీసుకెళ్లి.. తన మాట వినలేదని దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


కర్నాటక (Karnataka) చిక్కనాయకనహళ్లి ప్రాంతానికి చెందిన సుధ అనే మహిళ కానిస్టేబుల్‌గా (woman constable) విధులు నిర్వర్తిస్తోంది. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సుధ భర్త రెండేళ్ల క్రితం చనిపోవడంతో ప్రస్తుతం పిల్లలతో కలిసి  హులియూరు అనే ప్రాంతంలో ఉంటోంది. ఇదిలావుండగా, సుధకు తోడుగా ఉండేందుకు ఇటీవల తమ్ముడు మంజునాథ్ కూడా వచ్చాడు. తమ్ముడు తోడుగా ఉండడంతో సంతోషంగా ఉండేది. అయితే మంజునాథ్ మాత్రం.. అక్క ఆస్తిపై కన్నేశాడు. ఎలాగైనా ఆస్తి కొట్టేయాలని రోజూ ఆలోచిస్తూ ఉండేవాడు. అడిగితే ఒప్పుకోదనే ఉద్దేశంతో చివరికి అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

నా కూతుర్ని ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ.. అనుమానం వచ్చి విచారించగా.. బయటపడిన స్క్రీన్ ప్లే..


ఇటీవల ఓ రోజు.. మాట్లాడాలంటూ అక్కను కారులో ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆస్తి తన పేరు మీద రాయించాలని డిమాండ్ చేశాడు. అయితే ఇందుకు సుధ ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. చివరకు ఆగ్రహంతో ఊగిపోయిన మంజునాథ్.. అక్క అని చూడకుండా నిర్ధాక్షిణ్యంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత మంజునాథ్ భయంతో శివమొగ్గకు పారిపోయి... లాడ్జిలో దాక్కున్నాడు. చివరకు ఆందోళన ఎక్కువై.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎవరికీ అనుమానం రాకుండా.. భార్య మృతదేహంతో 500 కిలోమీటర్ల రైలు ప్రయాణం.. చివరగా పక్కనున్న వారు గమనించడంతో..Read more