చెట్టుకు ఉరి వేసి పదేళ్ల బాలుడిని చంపేశారు.. ఎవరి మీదైనా అనుమానం ఉందా అని ఆ తండ్రిని అడిగితే..

ABN , First Publish Date - 2022-05-21T19:41:27+05:30 IST

కొందరు చిన్న చిన్న కారణాలకే ఎదుటి వారిపై పగ పెంచుకుంటుంటారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చివరికి దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో..

చెట్టుకు ఉరి వేసి పదేళ్ల బాలుడిని చంపేశారు.. ఎవరి మీదైనా అనుమానం ఉందా అని ఆ తండ్రిని అడిగితే..

కొందరు చిన్న చిన్న కారణాలకే ఎదుటి వారిపై పగ పెంచుకుంటుంటారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చివరికి దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అభం,శుభం తెలియని వారు బలవుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి విషాధ ఘటనే చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడిని చెట్టుకు ఉరి వేసి చంపేశారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా అని బాలుడి తండ్రిని అడగ్గా పలు అనుమానాలు వ్యక్తం చేశాడు.


ఉత్తరప్రదేశ్ జస్వంత్‌పూర్ పరిధి కేవాలా గ్రామానికి చెందిన రణవీర్ సింగ్ వృత్తిరీత్యా రైతు. ఇతడికి భార్య ఆశిష్ కుమార్, యశ్‌కుమార్‌ అలియాస్‌ శివ యాదవ్‌ (10) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. యశ్‌కుమార్‌ ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. ఇలావుండగా, శుక్రవారం మధ్యాహ్నం యశ్‌కుమార్‌.. ఆడుకునేందుకు బయటికి వెళ్లాడు. అయితే ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతికారు. ఇంతలో, ఊరి బయట చెట్టుకు యశ్‌కుమార్‌ ఉరి వేయబడ్డాడని సమాచారం అందింది. దీంతో గ్రామస్తులు, యశ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి యశ్‌కుమార్‌‌ను కిందకు దించారు. అయితే అప్పటికే అతడు మృతి చెంది ఉన్నాడు.

ప్రేమ పెళ్లి చేసుకుని 15 రోజులు కూడా కాకముందే ఓ యువకుడి బలవన్మరణం.. తండ్రికి చివరగా వాట్సప్‌లో పంపిన మెసేజ్‌లో..


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసుల వద్ద రణవీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. యశ్‌కుమార్‌ను దత్తత తీసుకునే విషయంలో తనకు, తన అన్నకు మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, ఆ కోపంతోనే తన అన్న హత్య చేసి ఉంటాడని ఆరోపించాడు. తమకు దత్తత ఇచ్చే ఆలోచన లేదని చెప్పడంతో తమ కుటుంబంపై తన అన్న కోపం పెంచుకున్నాడని, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే.. పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

5 నెలల క్రితం పెళ్లి.. డాబాపై పడుకుని పొద్దునే కొడుకు, కోడల్ని లేపేందుకు వస్తే గదిలో కనిపించిన దృశ్యం చూసి..!

Read more