Engagement పంక్షన్‌లోకి వచ్చి.. యువకుడి ముక్కు, చెవులు కట్ చేసిన బంధువులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-08-11T18:37:12+05:30 IST
ఓ యువకుడు బంధువులు, సన్నిహితుల మధ్య ఓ యువతితో ఎంగేజ్‌మెంట్ (Engagement) చేసుకుంటున్నాడు. అంతా సందడిగా జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడ వాతావరణం..

ఓ యువకుడు బంధువులు, సన్నిహితుల మధ్య ఓ యువతితో ఎంగేజ్‌మెంట్ (Engagement) చేసుకుంటున్నాడు. అంతా సందడిగా జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. కొంతమంది బంధువులు లోపలికి వచ్చి.. నేరుగా యువకుడి వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. యువకుడిని గట్టిగా పట్టుకుని ముక్కు, చెవులు కట్ చేసి వెళ్లారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం బార్మర్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కమల్ సింగ్ బాటి అనే యువకుడు.. తమ బంధువుల అమ్మాయితో కొన్నాళ్లుగా ప్రేమలో (love) ఉన్నాడు. అయితే పెళ్లి వరకూ వచ్చే సరికి మాట మార్చాడు. ఇటీవల తనకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఎంగేజ్‌మెంట్ కూడా ఏర్పాటు చేశాడు.
Viral Video: స్మార్ట్ ఫోన్‌పై మనసు పారేసుకున్న కోతి పిల్ల.. తల్లి కోతి వద్దంటున్నా.. ఏం చేస్తుందో చూడండి..
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అంతా చూస్తుండగా.. యువకుడిని పట్టుకుని పక్కకు లాక్కెళ్లారు. చితకబాదడంతో పాటూ ముక్కు, చెవులు కోసేశారు. తర్వాత అతన్ని అక్కడే పడేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.