Viral Video: స్మార్ట్ ఫోన్‌పై మనసు పారేసుకున్న కోతి పిల్ల.. తల్లి కోతి వద్దంటున్నా.. ఏం చేస్తుందో చూడండి..

ABN , First Publish Date - 2022-08-11T17:44:16+05:30 IST

నేటి తరం పిల్లలు ఒక పూట అన్నం లేకున్నా ఉంటారేమో గానీ.. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొందరైతే పొద్దున నుంచి రాత్రి వరకూ సోషల్ మీడియాలో ..

Viral Video: స్మార్ట్ ఫోన్‌పై మనసు పారేసుకున్న కోతి పిల్ల.. తల్లి కోతి వద్దంటున్నా.. ఏం చేస్తుందో చూడండి..

నేటి తరం పిల్లలు ఒక పూట అన్నం లేకున్నా ఉంటారేమో గానీ.. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొందరైతే పొద్దున నుంచి రాత్రి వరకూ సోషల్ మీడియాలో (Social media) గడుపుతుంటారు. మరికొందరు పిల్లలైతే వివిధ రకాల గేమ్‌లకు (Video games) అడిక్ట్ అయి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కోతి పిల్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. స్మార్ట్ ఫోన్‌పై (Smart phone) మనసు పారేసుకున్న ఆ కోతి.. దాని తీసుకోవడం కోసం ప్రయత్నించడం.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో (Twitter Videos) వైరల్ అవుతోంది. ఓ పార్కులో తల్లి కోతి తన పిల్లతో కలిసి ఆహారం ఎదురుచూస్తూ ఉంటుంది. అక్కడి వెళ్లిన యువకుడు కోతికి ఆహారాన్ని అందిస్తూ.. మరో వైపు వీడియో తీస్తుంటాడు. తల్లి కోతి ఆహారం కోసం తాపత్రయపడుతుండగా.. పిల్ల కోతి మాత్రం అదేమీ పట్టించుకోకుండా స్మార్ట్ ఫోన్ వైపే చూస్తుంటుంది. ఫోన్ తీసుకోవాడానికి పదే పదే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ యువకుడు ఫోన్‌ను గట్టిగా పట్టుకోవడంతో.. అది ఎంత లాగినా సాధ్యం కాదు. మరోవైపు తల్లి కోతి.. సైలెంట్‌గా ఉండు.. అన్నట్లుగా పిల్లకోతిని దూరంగా లాగుతుంది. అయినా పిల్ల కోతి మాత్రం మళ్లీ మళ్లీ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

girlfriend పుట్టింటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమెకు ఫోన్‌లోని వీడియోలను చూపించిన అనంతరం..





Updated Date - 2022-08-11T17:44:16+05:30 IST