భార్య చనిపోయిన నెల తర్వాత వీడియో విడుదల చేసిన భర్త.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకునే లోపే..

ABN , First Publish Date - 2022-09-03T01:34:46+05:30 IST

కొందరు తమకు జరిగిన అన్యాయంపై ఎంతవరకైనా పోరాటం చేస్తారు. చివరకు తాడోపేడో తేల్చుకునే వరకూ వదిలిపెట్టారు. అయితే కొన్నిసార్లు అవతలి వ్యక్తులు బలవంతులైనప్పుడు..

భార్య చనిపోయిన నెల తర్వాత వీడియో విడుదల చేసిన భర్త.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకునే లోపే..

కొందరు తమకు జరిగిన అన్యాయంపై ఎంతవరకైనా పోరాటం చేస్తారు. చివరకు తాడోపేడో తేల్చుకునే వరకూ వదిలిపెట్టారు. అయితే కొన్నిసార్లు అవతలి వ్యక్తులు బలవంతులైనప్పుడు.. బాధితులకు చివరకు అన్యాయమే జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది హత్యలు చేయడమో లేక ఆత్మహత్యలకు పాల్పడడమో చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య చనిపోయిన నెల తర్వాత భర్త వీడియో విడుదల చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి హుటాహుటిన వెళ్లారు. అయితే అప్పటికే ఘోరం జరిగిపోయింది. వివరాల్లోకి వెళితే..


బాధితుడి కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఝాన్సీ పరిధి ప్రేమ్ నగర్‌లో దంపతులు (couple) నివాసం ఉంటున్నారు. నెల రోజుల క్రితం భార్యపై పొరుగున ఉండే ఓ వ్యక్తి, తన స్నేహితుడు, మరో పోలీసు సిబ్బంది కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అయితే నిందితుల్లో పోలీసు సిబ్బంది ఉండడంతో భర్త కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇటీవల అతను ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు.

Pilot warning Video: విమానం గాల్లో ఉండగా అదే పనిగా పైలట్‌కు నగ్న ఫొటోలను పంపిస్తున్న ప్రయాణికులు.. చివరకు ఏం జరిగిందంటే..


జరిగిన దారుణానికి తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. ప్రస్తుతం తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వెంటనే అలెర్ట్ అయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ యువకుడు అప్పటికే ఉరి వేసుకుని ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలో యువకుడు చెప్పింది నిజమా, కాదా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

భార్యపై కోపం.. ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్లి మరీ మహిళ పేరుతో ఓ సిమ్‌ను కొని ఓ భర్త మాస్టర్ ప్లాన్.. చివరకు..Read more