భార్యపై కోపం.. ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్లి మరీ మహిళ పేరుతో ఓ సిమ్‌ను కొని ఓ భర్త మాస్టర్ ప్లాన్.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-02T22:29:12+05:30 IST

దంపతుల్లో ఒకరిపై ఇంకొకరికి కోపం ఉన్నా.. కొన్నాళ్లకు సర్దుకుపోతుంటారు. అయితే కొందరు మాత్రం తమ కోపాన్ని వివిధ రూపాల్లో తీర్చుకుంటుంటారు. ఇంకొందరైతే చిత్రవిచిత్రమైన..

భార్యపై కోపం.. ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్లి మరీ మహిళ పేరుతో ఓ సిమ్‌ను కొని ఓ భర్త మాస్టర్ ప్లాన్.. చివరకు..

దంపతుల్లో ఒకరిపై ఇంకొకరికి కోపం ఉన్నా.. కొన్నాళ్లకు సర్దుకుపోతుంటారు. అయితే కొందరు మాత్రం తమ కోపాన్ని వివిధ రూపాల్లో తీర్చుకుంటుంటారు. ఇంకొందరైతే చిత్రవిచిత్రమైన ఐడియాలతో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటారు. ఢిల్లీ పరిధిలో ఇలాంటి విచిత్రమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్యపై కోపం పెంచుకున్న ఓ వ్యక్తి.. చివరకు బీహార్ వెళ్లి మహిళ పేరుతో సిమ్ కొన్నాడు. చివరకు అతడి నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఢిల్లీ (Delhi) పరిధి గురుగ్రామ్‌కు చెందిన మహ్మద్ రియాజ్ ఆలం అనే వ్యక్తి భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. రియాజ్.. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తుండేవాడు. ఇలావుండగా, ఇటీవల ఇంట్లో భార్యాభర్తల (husband and wife) మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రోజూ గొడవలు జరుగుతుండేవి. రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో ఇటీవల ఆమె పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి భార్యను తీసుకురావాలని పలుమార్లు అత్తగారింటికి వెళ్లాడు. అయితే కూతురును పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో భార్య, మామపై రియాజ్ పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వివిధ రకాలుగా ఆలోచించాడు.

బయటికెళ్లిన భర్త.. ఇంటికొచ్చేసరికే దారుణం.. బెడ్‌రూం తలుపులు తీసి చూడగా...


చివరకు ఇటీవల ఓ రోజు ఢిల్లీ నుంచి బీహార్ వెళ్లాడు. అక్కడ ఓ మహిళ పేరుతో సిమ్ కొన్నాడు. అందులో నుంచి తనకు తెలిసిన కాంట్రాక్టర్‌కు తన మామ పేరుతో మెసేజ్ చేశాడు. అర్జంట్‌గా రూ.10లక్షలు చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అనంతరం తన మామకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ వివరాలను పంపాడు. దీనిపై సదరు కాంట్రాక్టర్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిమ్ నంబర్ ఆధారంగా విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చివరకు రియాజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Cameras in School Toilets: బాత్రూంలలో సీసీ కెమెరాలు.. అధికారులు నిలదీస్తే స్కూలు యాజమాన్యం చెప్పిన కారణం విని..



Updated Date - 2022-09-02T22:29:12+05:30 IST