పిల్లలను స్కూలుకు పంపించి వచ్చే లోపే.. భార్యను ప్రియుడే చంపేశాడంటూ ఏడుస్తూ చెప్పిన భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-09-16T01:14:49+05:30 IST

అభం శుభం తెలియని భార్యలను వివిధ సాకులు చూపుతూ కొందరు భర్తలు కావాలనే వేధిస్తుంటారు. ఇంకొందరైతే రోజూ వివిధ రకాలుగా చిత్రహింసలు పెడుతూ తమ శాడిజాన్ని..

పిల్లలను స్కూలుకు పంపించి వచ్చే లోపే.. భార్యను ప్రియుడే చంపేశాడంటూ ఏడుస్తూ చెప్పిన భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

అభం శుభం తెలియని భార్యలను వివిధ సాకులు చూపుతూ కొందరు భర్తలు కావాలనే వేధిస్తుంటారు. ఇంకొందరైతే రోజూ వివిధ రకాలుగా చిత్రహింసలు పెడుతూ తమ శాడిజాన్ని ప్రదర్శిస్తుంటారు. మధ్యప్రదేశ్‍‌లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పిల్లలను స్కూలుకు పంపించి వచ్చే లోపే.. తన భార్యను ప్రియుడు హత్య చేశాడంటూ, పోలీసులకు భర్త ఫోన్ చేసి చెప్పాడు. అయతే చివరకు పోలీసుల విచారణలో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్‌ పరిధి వాటిక విహార్ కాలనీలో నివాసం ఉంటున్న రాజేష్‌ సూర్యవంశీకి భార్య పూనమ్ (36), నైతిక్ సూర్యవంశీ, రాజ్ సూర్యవంశీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేష్..  గోవింద్‌పురా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అదేవిధంగా పూనమ్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో శుభ్రపరిచే పని చేస్తోంది. ఇదిలావుండగా, ఇటీవల రాజేష్ చీటికీమాటికీ భార్యను అనుమానించేవాడు. ఎవరితో అక్రమ సంబంధం (extramarital affair) పెట్టుకున్నావంటూ వేధించేవాడు. మరోవైపు ఇటీవల ఇల్లు కట్టుకోవడానికి రాజేష్‌కు అతని మామ రూ.2లక్షలు ఇచ్చాడు. అయితే ఇటీవల పూనమ్ చెల్లెలు వివాహం ఉండడంతో తన తండ్రికి డబ్బు తిరిగి ఇవ్వాలని భార్య అడుగుతూ ఉండేది. ఈ విషయంలోనూ తరచూ గొడవలు జరుగుతుండేవి.

4 నెలల క్రితం పెళ్లి.. భార్యను పడుకోమని చెప్పి.. చదువుకుంటానంటూ మరో గదిలోకి వెళ్లిన భర్త.. తెల్లవారుజామున ఆమె వెళ్లి చూస్తే..


ఇటీవల దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా రాజేష్ మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఇదిలావుండగా, బుధవారం రాజేష్.. పోలీసులకు ఫోన్ చేశాడు. ‘‘పిల్లలను స్కూలుకు పంపింపి వచ్చేలోపు తన భార్యను ప్రియుడు చంపేశాడు’’.. అని ఏడుస్తూ చెప్పాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. దీంతో చివరకు నేరం అంగీకరించాడు. కత్తితో చేతులు, కాళ్లు నరికి చంపినట్లు తెలిసింది. తండ్రి చేసిన దారుణానికి తల్లి ప్రేమకు దూరమైన పిల్లలను చూసి.. స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి బయట కూర్చున్న ఇద్దరు కూతుళ్లను బైక్‌లపై వచ్చి ఎత్తుకెళ్లిన యువకులు.. గ్రామస్తులతో కలిసి ఆ తల్లి వెతుక్కుంటూ పొలాల్లోకి వెళ్తే..Read more