లిఫ్ట్ ఇస్తానంటూ ఆటోలో ఎక్కించుకున్నాడు.. వారం రోజుల పాటు గదిలో బంధించి మరీ దారుణం.. ప్రస్తుతం అతడి పరిస్థితి..

ABN , First Publish Date - 2022-07-09T21:41:26+05:30 IST

కొందరు తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. మరికొందరు బాలికలు అని కూడా చూడకుండా దారుణాలకు తెగబడుతుంటారు. జైలుకు వెళ్లొచ్చినా కొందరి తీరు మాత్రం మారదు. హర్యానాలో ఓ..

లిఫ్ట్ ఇస్తానంటూ ఆటోలో ఎక్కించుకున్నాడు.. వారం రోజుల పాటు గదిలో బంధించి మరీ దారుణం.. ప్రస్తుతం అతడి పరిస్థితి..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. మరికొందరు బాలికలు అని కూడా చూడకుండా దారుణాలకు తెగబడుతుంటారు. జైలుకు వెళ్లొచ్చినా కొందరి తీరు మాత్రం మారదు. హర్యానాలో ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. లిఫ్ట్ ఇస్తానంటూ బాలికను ఆటోలో ఎక్కించుకున్నాడు. అయితే తర్వాత ఎక్కడా ఆపకుండా అటు నుంచి అటే తన ఇంటికి తీసుకెళ్లాడు. వారం రోజుల పాటు గదిలో బంధించి మరీ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది..


హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ పరిధిలో 2019లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 12ఏళ్ల బాలిక.. ఓ రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి తెలిసిన వారిని కలిసేందుకు నడుస్తూ వెళ్తోంది. ఈ క్రమంలో దారి మధ్యలో గౌరవ్ అనే వ్యక్తి ఆటో ఆపుకొని ఉన్నాడు. బాలికను చూడగానే.. లిఫ్ట్ ఇస్తానంటూ ఆటో ఎక్కించుకున్నాడు. అయితే ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లకుండా.. అటు నుంచి అటే అతడి ఇంటికి తీసుకెళ్లాడు. ఇదేంటీ.. ఇక్కడికి తీసుకొచ్చావ్.. అని బాలిక ప్రశ్నించింది. అయినా వినిపించుకోకుండా బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి, తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

వైద్యం చేసే క్రమంలో ఆమెతో పరిచయం.. తీరా పెళ్లి చేసుకుంటుండగా మంటపంలో ఊహించని twist.. చివరకు ఏమైందంటే..


బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి, వారం రోజుల పాటు ఆమెపై దారుణానికి తెగబడ్డాడు. అనంతరం బాలికను తన ఇంటి బయట వదిలి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన కూతురిని.. ఎక్కడికెళ్లావ్.. అని కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో జరిగిన విషయం మొత్తం తెలియజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటూ రూ.40వేల జరిమానా విధిస్తూ.. కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Uttar Pradesh: నేను చెప్పినట్లు చేస్తే రోజూ ఆదాయం వస్తుంది.. అంటూ భార్యకు నచ్చజెప్పాడు.. మరుసటి రోజే స్నేహితుడిని ఇంట్లోకి పిలిచి..

Read more