అర్ధరాత్రి girlfriend ఇంటికి వెళ్లిన ప్రియుడు.. యువతి నిద్రలో ఉందని తెలుసుకుని.. చివరకు..

ABN , First Publish Date - 2022-08-17T00:08:15+05:30 IST

ప్రేమ మొదలైన సమయంలో యువతీయువకుల మధ్య ఎలాంటి సమస్యలూ ఉండవు. అయితే కొందరి విషయంలో రాను రాను అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్నిసార్లు...

అర్ధరాత్రి girlfriend ఇంటికి వెళ్లిన ప్రియుడు.. యువతి నిద్రలో ఉందని తెలుసుకుని.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ మొదలైన సమయంలో యువతీయువకుల మధ్య ఎలాంటి సమస్యలూ ఉండవు. అయితే కొందరి విషయంలో రాను రాను అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడమో, కులమతాలు అడ్డురావడమో జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో కొందరు యువకులు.. ప్రియురాలి క్షేమం కోసం ప్రేమను త్యాగం చేస్తే.. మరికొందరు ఎలాగైనా తమకే దక్కాలనే ఉద్దేశంతో దారుణాలకు పాల్పడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోసుకుంది. అర్ధరాత్రి ప్రియురాలి (girlfriend) ఇంటికి వెళ్లిన ప్రియుడు.. ఆమె నిద్రలో ఉందని తెలుసుకుని, దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం లఖింపూర్ ఖేరీ పరిధి భాసోరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న సీమా అనే యువతి, ఎదురింట్లో ఉంటున్న రాజేష్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వారికి తెలీకుండా తరచూ కలుసుకునేవారు. ఇటీవల వారి ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. రాజేష్ నిరుద్యోగి (unemployed) కావడంతో అతడితో తమ కూతురి పెళ్లికి అంగీకరించలేదు. ఇదే విషయం యువతి.. రాజేష్‌కు వివరించి, తనను మర్చిపోవాలని సూచించింది. అయితే రాజేష్ మాత్రం ఎలాగైనా తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో యువతికి ఇటీవల ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు.

Shocking incident: జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. వారి కోసం ఎదురు చూస్తున్న తల్లి.. తలుపులు తీసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా..


ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఓ రోజు అర్ధరాత్రి సీమా ఇంటికి వెళ్లాడు. ప్రియురాలు నిద్రపోతుండడాన్ని గమనించి, ఆమెపై కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. సీమా మెడపై పలుమార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడింది. అనంతరం రాజేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

హోటల్‌లో ఉన్న young woman.. కాసేపటికి కారులో ప్రత్యక్షం.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. అని ప్రియుడిని అడగడంతో..Updated Date - 2022-08-17T00:08:15+05:30 IST