నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన పాప ఇప్పుడెలా ఉందో చూశారా..? సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టిన Sonu Sood

ABN , First Publish Date - 2022-06-10T19:24:56+05:30 IST

కరోనా సమయంలో పేద ప్రజలకు, వలస కూలీలకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్.

నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన పాప ఇప్పుడెలా ఉందో చూశారా..? సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టిన Sonu Sood

కరోనా సమయంలో పేద ప్రజలకు, వలస కూలీలకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్. వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా మనన్నలు పొందాడు. ఆ తర్వాత కూడా ఎంతో మందికి ఇళ్లు కట్టించడం, చదువుకు సహాయం చేయడం వంటి పనులు చేశాడు. తాజాగా ఓ చిన్నారికి సహాయపడి తన మానవత్వం చాటుకున్నాడు. బీహార్‌లోని నెవెడా జిల్లాకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించింది. 


ఇది కూడా చదవండి..

భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక.. మూడేళ్లుగా కొండని తవ్వుతున్న భర్త.. చచ్చేలోపు సాధిస్తానంటూ..


పేదరికం వల్ల ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆమెకు వైద్య సహాయం అందించలేకపోయారు. సోషల్ మీడియా ద్వారా ఆ చిన్నారి గురించి తెలుసుకున్న సోనూసూద్ ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆ చిన్నారికి వైద్యం చేయించి సాధారణ స్థితికి వచ్చేలా చేశాడు. చికిత్స అనంతరం హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఆ చిన్నారి ఫొటోను సోనూ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉందని కామెంట్ చేశాడు. సోనూ ఈ భూమి మీద ఉన్న ఉన్నతమైన మనిషి అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Updated Date - 2022-06-10T19:24:56+05:30 IST