బావ Birthday వేడుకలకు వెళ్తుండగా.. భర్త ఎదుటే భార్యను చేయి పట్టుకున్న యువకులు.. చివరకు అంతా చూస్తుండగా..

ABN , First Publish Date - 2022-08-07T00:17:04+05:30 IST

ఆమె తన బావ పుట్టినరోజు వేడుకలకు (Birthday celebrations) భర్తతో పాటూ బయలుదేరింది. ఇద్దరూ కలిసి షాపులోకి వెళ్లి కేక్ కొన్నారు. అనంతరం వేడుకలు నిర్వహించేందుకు వెళ్తుండగా..

బావ Birthday వేడుకలకు వెళ్తుండగా.. భర్త ఎదుటే భార్యను చేయి పట్టుకున్న యువకులు.. చివరకు అంతా చూస్తుండగా..
ప్రతీకాత్మక చిత్రం

ఆమె తన బావ పుట్టినరోజు వేడుకలకు (Birthday celebrations) భర్తతో పాటూ బయలుదేరింది. ఇద్దరూ కలిసి షాపులోకి వెళ్లి కేక్ కొన్నారు. అనంతరం వేడుకలు నిర్వహించేందుకు వెళ్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీంతో వారి ఆనందం కాస్త.. మరుక్షణంలోనే ఆవిరైంది. భర్త ఎదుటే భార్య చేయి పట్టుకున్న యువకులు.. చివరకు అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా వారు చేసిన నిర్వాకం.. స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..


హర్యానా (Haryana) రాష్ట్రం హిసార్‌ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతికి విజయ్ అనే యువకుడితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఓ కుమార్తె ఉంది. ఇదిలావుండగా, ఆగస్టు 4న విజయ్ అన్న పుట్టిన రోజు కావడంతో లాహోరియా అనే ప్రాంతంలో ఉన్న సోదరుడి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దారి మధ్యలో ఓ షాపులో కేక్ కూడా తీసుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి వేడుకలకు బయలుదేరారు. అయితే అదే సమయంలో కొందరు యువకులు రెండు బైకుల్లో అక్కడికి వచ్చారు. మహిళను చూసి ఈలలు వేస్తూ విసిగించసాగారు. తర్వాత భర్త ఎదుటే భార్య చేయి పట్టుకుని పక్కకు లాగారు. మరో యువకుడు ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. భార్య మీద చేయి వేయడంతో విజయ్‌కి కోపం వచ్చి.. అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.

inhuman incident: మామ పిలవడంతో ఇంటికి వెళ్లింది.. పక్కన కూర్చోబెట్టుకుని చివరకు ఇలాంటి పని చేస్తాడని ఎవరూ ఊహించలేదు.


దీంతో ఆ యువకులు భర్తపై దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ సోదరుడు.. కంగారుగా అక్కడికి చేరుకున్నాడు. తమ్ముడు, మరదలిపై యువకులు దాడి చేయడాన్ని చూసి అడ్డుకోబోయాడు. దీంతో వారు అతడిపై కూడా దాడికి తెగబడ్డారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.2,500 నగదు (cash) , మొబైల్ (Mobile) తీసుకుని పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన ముగ్గురినీ స్థానికులు.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. అనిల్, రాహుల్, దీపాంశు అనే ముగ్గురు యువకులపై అత్యాచారం, స్నాచింగ్‌, దాడి తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

girlfriend వద్దకు ఫ్రెండ్స్‌ని పంపించిన police Constable.. సామాన్లు ఇంట్లో పెట్టి వెళ్తామని చెప్పి.. లోపల వారు చేసిన నిర్వాకం..Read more