RGV: వర్మ ‘వ్యూహం’ అప్‌డేట్

ABN , First Publish Date - 2022-12-06T17:29:26+05:30 IST

నేను అతి త్వరలో ‘వ్యూహం’ (Vyuham) అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో‌పిక్‌లో అయినా

RGV: వర్మ ‘వ్యూహం’ అప్‌డేట్
Ram Gopal Varma

‘‘నేను అతి త్వరలో ‘వ్యూహం’ (Vyuham) అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో‌పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి..’’ అంటూ సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) రీసెంట్‌గా ఓ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ (YS Jagan)ని కలిసిన అనంతరం.. ఆయన ఈ ప్రకటన చేయడంతో.. రాజకీయ వర్గాల్లోనే కాకుండా.. సినీ వర్గాల్లో సైతం ‘వ్యూహం’పై ఆసక్తి నెలకొంది. అసలు జగన్, వర్మల ‘వ్యూహం’ ఏమై ఉంటుందా? అని అంతా అనుకుంటున్న వేళ.. మళ్లీ ఆయనే ‘‘ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక.. ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు..’’ అంటూ ఎప్పటిలానే కన్ఫ్యూజ్ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు వర్మ. అంతేకాదు, 2 పార్ట్స్‌గా ఈ రియల్ పిక్ రాబోతుందని తెలుపుతూ.. మొదటి పార్ట్ ‘వ్యూహం’, రెండవ పార్ట్ ‘శపథం’ అని టైటిల్స్ కూడా రివీల్ చేశాడు వర్మ. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాలను ఎవరు నిర్మించబోతున్నారో కూడా.. పెండింగ్ లేకుండా పనిలో పనిగా వర్మ ప్రకటించేశాడు.

అయితే వర్మ ఈ ప్రకటన చేసి చాలా కాలం అవుతుంది. వర్మ దేనికీ ఇంత టైమ్ తీసుకోడు. ఒక్కసారి ఫిక్స్ అయితే.. తన మాట తను కూడా వినడు. కానీ ఈ ప్రాజెక్ట్స్‌కు సంబందించి ఫండింగ్, ఫీడింగ్ అందలేదేమో.. ఆ తర్వాత వర్మ.. కామ్‌గానే ఉన్నాడు. అసలు ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయా? అని అనుకుంటున్న సమయంలో.. అలాంటిదేమీ లేదనేలా వర్మ (Varma) సైడ్ నుంచి ఓ వార్త వచ్చింది. తాజాగా ఈ వ్యూహానికి సంబంధించి వర్మ సైడ్ నుంచి వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే.. జనవరి నుంచి మొదటి పార్ట్ ‘వ్యూహాం’కు సంబంధించిన షూట్‌ని ప్రారంభించబోతున్నట్లుగా వర్మ వెల్లడించాడు. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) చనిపోయిన తర్వాత జరిగే సంఘటనలు ఉంటాయని, ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లుగా వర్మ వివరించాడు. ఆంధ్రా రాజకీయాల్లో ఉన్న డ్రామా తెలంగాణలో లేదు. అందుకే ఏపీ రాజకీయాలపై సినిమాలు తీస్తున్నా. అలాగే టిడిపి, వైసీపీ పార్టీల్లో నాకు మిత్రులు ఉండడం కూడా మరో కారణం.. అని రామ్ గోపాల్ వర్మ.. ‘వ్యూహం’కు సంబంధించిన అప్‌డేట్‌లో తెలిపారు. (Ram Gopal Varma Vyuham Movie Update)

Updated Date - 2022-12-06T17:52:01+05:30 IST