ప్లాస్టిక్ డ్రమ్ము నిండా కాంక్రీట్.. సుత్తితో పగలగొడితే కనిపించిన దృశ్యం చూసి అందరికీ మైండ్ బ్లాక్.. ఇదేం పని అని నిలదీస్తే..

ABN , First Publish Date - 2022-05-18T17:33:15+05:30 IST

ఓ వ్యక్తి అనుమానాస్పద వైఖరి గురించి పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.. పోలీసులు వచ్చి అతడి ఇంట్లో సోదాలు చేశారు. అతడిని నిలదీస్తే ఓ ప్లాస్టిక్ డబ్బాను చూపించారు. దాంట్లో అంతా కాంక్రీట్ నిండి...

ప్లాస్టిక్ డ్రమ్ము నిండా కాంక్రీట్.. సుత్తితో పగలగొడితే కనిపించిన దృశ్యం చూసి అందరికీ మైండ్ బ్లాక్.. ఇదేం పని అని నిలదీస్తే..

ఓ వ్యక్తి అనుమానాస్పద వైఖరి గురించి పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.. పోలీసులు వచ్చి అతడి ఇంట్లో సోదాలు చేశారు. అతడిని నిలదీస్తే ఓ ప్లాస్టిక్ డబ్బాను చూపించారు. దాంట్లో అంతా కాంక్రీట్ నిండి ఉంది. సుత్తితో ఆ ప్లాస్టిక్ డబ్బాను, కంకరను పగలగొడితే కనిపించిన దృశ్యం చూసి అంతా నివ్వరపోయారు. ఇదేం పని అని నిలదీస్తే అతడి సమాధానం విని మరింత ఆశ్చర్యపోయారు.. అసలు వివరాల్లోకి వెళ్తే...


చెన్నై నీలాంకరై సరస్వతి నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గోపాల్, షెన్బగం (86) అనే దంపతులకు ప్రభు, మురుగన్, సురేష్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కోడుకు సురేష్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇటీవల భార్య, పిల్లలు అతన్ని వదిలిపెట్టి వెళ్లారు. దీంతో అతడు తల్లితో కలిసి ఉంటున్నాడు. పెద్ద కొడుకు ప్రభు గత ఆదివారం తల్లిని చూసేందుకు వెళ్లాడు. అయితే సురేష్ మాత్రం అతడిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు. తల్లి ఇంట్లో లేదంటూ బయటికి వెళ్లమంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రభుకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని సురేష్‌ను వివిధ కోణాల్లో విచారించారు.

అమ్మాయిలా ప్రవర్తిస్తున్నావంటూ హేళన చేస్తున్న ఫ్రెండ్స్.. వాళ్లను పార్టీకి పిలిచి మరీ ఆ ఇంటర్ కుర్రాడు చేసిన దారుణమిదీ..!


చివరకు కాంక్రిట్‌తో నిండిన ఓ ప్టాస్టిక్ డ్రమ్మును చూపించాడు. దీంతో కాంక్రిట్‌ను పగులగొట్టి చూడగా లోపల షెన్బగం మృతదేహం ఉండడంతో అంతా షాక్ అయ్యారు. దాదాపు 15రోజుల కిందట వృద్ధురాలు మృతి చెందినట్లు తెలిసింది. అయితే అనారోగ్యం కారణంగా మృతి చెందిందా, లేక సురేష్ హత్య చేశాడా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడిని పరీక్షించిన వైద్యులు... అతడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

వేర్వేరుగా ఉంటున్న తల్లిదండ్రులను కలపాలని కుమారుడి తపన.. అన్ని ప్రయత్నాలూ విఫలమవడంతో చివరకు అతడు చేసిన పని..

Updated Date - 2022-05-18T17:33:15+05:30 IST