Viral Video: ఈ వీడియో చూశారా? నిజమైన టామ్ అండ్ జెర్రీ ఇలాగే ఉంటాయేమో..

ABN , First Publish Date - 2022-12-26T15:44:03+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అందరినీ అలరించిన కార్టూన్ షో `టామ్ అండ్ జెర్రీ`. పిల్లి, ఎలుక మధ్య జరిగే ఆ పోరాటాలు కొన్ని దశబ్దాలు పాటు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిజ జీవితంలో కూడా ఎలుకకు, పిల్లికి పడదనే సంగతి తెలిసిందే

Viral Video: ఈ వీడియో చూశారా? నిజమైన టామ్ అండ్ జెర్రీ ఇలాగే ఉంటాయేమో..

ప్రపంచ వ్యాప్తంగా పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అందరినీ అలరించిన కార్టూన్ షో టామ్ అండ్ జెర్రీ (Tom and Jerry). పిల్లి, ఎలుక మధ్య జరిగే ఆ పోరాటాలు కొన్ని దశబ్దాలు పాటు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిజ జీవితంలో కూడా ఎలుకకు, పిల్లికి పడదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలిని పిల్లి, ఎలుక పోరు చూస్తే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ (Real life Tom and Jerry)గుర్తుకు రావడం ఖాయం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లిని ఎలుక బెదిరించడాన్ని చూడవచ్చు.

CCTV_IDIOTS అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను పోస్ట్ చేసి మీ ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు అని కామెంట్ చేశారు. 13 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.37 లక్షల మందికి పైగా చూశారు. 2 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై (Viral Video) నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

Updated Date - 2022-12-26T15:44:05+05:30 IST