ఇంటికి రా.. నీ కళ్ల ముందే నా భార్యను చంపేస్తా.. అని ప్రియుడు ఫోన్ చేస్తే వెళ్లిందా యువతి.. చివరకు ఊహించని ట్విస్ట్..

ABN , First Publish Date - 2022-05-24T18:42:03+05:30 IST

అతను ఆరేళ్లుగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు..

ఇంటికి రా.. నీ కళ్ల ముందే నా భార్యను చంపేస్తా.. అని ప్రియుడు ఫోన్ చేస్తే వెళ్లిందా యువతి.. చివరకు ఊహించని ట్విస్ట్..

అతను ఆరేళ్లుగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు.. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. అయితే తల్లిదండ్రుల బలవంతంతో ఐదు నెలల క్రితం వేరే మహిళను వివాహం చేసుకోవాల్సి వచ్చింది.. అయినప్పటికీ తన ప్రేయసిని మర్చిపోలేకపోయాడు.. తన భార్యకు విడాకులు ఇస్తానని ప్రేయసికి చెప్పేవాడు.. విడాకులు సాధ్యం కాకపోవడంతో భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు.. తన ప్రేయసిని ఇంటికి పిలిచి ఆమె ఎదురుగానే భార్యను కిరాతకంగా హత్య చేశాడు.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

ఇది కూడా చదవండి..

ప్రియుడి దారుణ హత్య.. భర్తే చంపించాడని తెలిసి 40 ఏళ్ల ఆ భార్య నిర్వాకమిది.. ఇంట్లోంచి బయటకు వెళ్లి..


ఆగ్రాకు చెందిన ఉపేంద్ర అనే యువకుడికి ఐదు నెలల క్రితం ప్రీతి అనే యువతితో వివాహమైంది. అయితే ఆరేళ్లుగా మోనిక అని యువతితో ఉపేంద్ర ప్రేమలో ఉన్నాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు ఉపేంద్ర తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారి బలవంతంతో ఐదు నెలల క్రితం ప్రీతిని ఉపేంద్ర వివాహం చేసుకోవాల్సి వచ్చింది. వివాహం చేసుకున్న తర్వాత కూడా మోనికను ఉపేంద్ర మర్చిపోలేకపోయాడు. ప్రీతికి విడాకులు ఇచ్చి మోనికను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే విడాకులు రావడం సాధ్యం కాదని తెలియడంతో ప్రీతిని చంపాలనుకున్నాడు. 


శనివారం మోనికకు ఉపేంద్ర ఫోన్ చేసి తన ఇంటికి రావాలని అడిగాడు. నీ ఎదురుగానే భార్యను చంపేస్తానని మాటిచ్చాడు. దాంతో మోనిక తన స్నేహితురాలు పల్లవితో కలిసి ఉపేంద్ర ఇంటికి వెళ్లింది. ఆ ఇద్దరు యువతుల ఎదురుగానే ప్రీతి గొంతును ఉపేంద్ర కోసేశాడు. అయినా ఆమె మరణించకపోవడంతో మొహంపై తలగడ అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశాడు. ఆ సమయంలో ప్రీతి కాళ్లు, చేతులను మోనిక, పల్లవి పట్టుకున్నారు. అనంతరం ముగ్గురూ బయటకు వెళ్లిపోయారు. తన కోడలి హత్య గురించి ఉపేంద్ర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి ఉపేంద్ర, మోనిక, పల్లవిని అరెస్ట్ చేశారు.  

Read more