`అన్నయ్యా..` అని పిలిచే బాలికను లోబరుచుకుని అత్యాచారం.. చివరకు అతను ఎంతకు తెగించాడంటే..

ABN , First Publish Date - 2022-08-29T23:53:24+05:30 IST

ఆ బాలిక తన పొరుగింట్లో ఉండే యువకుడితో సన్నిహితంగా ఉండేది.. `అన్నయ్యా` అని పిలుస్తూ అతడి దగ్గరకు వెళ్లేది..

`అన్నయ్యా..` అని పిలిచే బాలికను లోబరుచుకుని అత్యాచారం.. చివరకు అతను ఎంతకు తెగించాడంటే..

ఆ బాలిక తన పొరుగింట్లో ఉండే యువకుడితో సన్నిహితంగా ఉండేది.. `అన్నయ్యా` అని పిలుస్తూ అతడి దగ్గరకు వెళ్లేది.. ఆ యువకుడు ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ ఘటనను వీడియో తీశాడు.. ఆ వీడియో చూపించి ఆ బాలికపై ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.. అంతేకాదు.. ఆ వీడియో చూపించి ఆ బాలిక తల్లిదండ్రులను కూడా బెదిరించి రూ.60 వేలు వసూలు చేశాడు.. అతడి వేధింపులను తట్టుకోలేక బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.


ఇది కూడా చదవండి..

Rajasthan: ఉదయాన్నే నిద్ర లేచి తల్లిని చూసి కేకలు పెట్టిన బాలిక.. అసలేం జరిగిందంటే..


రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపూర్‌లో అజ్మీర్‌ రోడ్డులో నివాసం ఉంటున్న 22 ఏళ్ల యువతి.. ఓ యువకుడిపై అత్యాచారం కింద కేసు పెట్టింది. 2016లో తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడు పొరుగున ఉండే అబ్బాయి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. మాయ మాటలు చెప్పి లోబరుచుకుని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ ఘటనను వీడియో తీశాడని చెప్పింది. ఆ వీడియోతో బెదిరించి ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని తెలిపింది. తననే కాకుండా తన తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నాడని చెప్పింది. 


ఆ వీడియోను పోర్న్ సైట్‌లో పెడతానని బెదిరించి తమ కుటుంబం నుంచి దఫదఫాలుగా రూ.60 వేల వరకు వసూలు చేశాడని తెలిపింది. ప్రస్తుతం ఆ యువకుడి నుంచి దూరంగా వేరే ఊరు వెళ్లిపోయినా వదలడం లేదని, ఫోన్ చేసి దుర్భాషలాడడం, బెదిరించడం చేస్తున్నాడని చెప్పింది. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. పోక్సో చట్టం, దాడి, అత్యాచారం చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more