ఆవులు, గేదెలు లేకుండా పాల వ్యాపారమేంటని అంతా నవ్వారు.. కానీ ఇప్పుడు లక్షల సంపాదన..!

ABN , First Publish Date - 2022-04-04T00:15:13+05:30 IST

పాలు అంటనే.. గేదె పాలా? ఆవు పాలా? అని అంటాం. సాధారణంగా జంతువుల నుంచే పాలు వస్తుంటాయి కాబట్టి. వేరే పాల గురించి సాధారణంగా ఆలోచనే రాదు. అయితే ...

ఆవులు, గేదెలు లేకుండా పాల వ్యాపారమేంటని అంతా నవ్వారు.. కానీ ఇప్పుడు లక్షల సంపాదన..!

పాలు అంటనే.. గేదె పాలా? ఆవు పాలా? అని అంటాం. సాధారణంగా జంతువుల నుంచే పాలు వస్తుంటాయి కాబట్టి. వేరే పాల గురించి అసలు ఆలోచనే రాదు. అయితే ఆవులు, గేదె పాలు కాకుండా వేరే పాల పేరు చెబితే.. ఇదేంటి! విచిత్రంగా ఉందే.. అని అనుకుంటాం. కానీ ఇది నిజం.. కర్ణాటకకు చెందిన సుమైర్ అనే వ్యక్తి.. దీన్ని చేసి చూపించాడు. అంతేకాడు ప్రస్తుతం ఆవు, గేదె రహిత పాల విక్రయం ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. అంతటితో ఆగకుండా సుమారు 10మందికి ఉపాధి కల్పించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆ పాలు ఎలా తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు.. తదితర వివరాలు తెలుసుకుందాం..


కర్ణాటకకు చెందిన సుమైర్.. బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశాడు. చాలా కాలం పాటు వివిధ కంపెనీల్లో పని చేశాడు. అయితే అందులో అతడికి ఏమాత్రం సంతృప్తి ఉండేది కాదు. ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచించేవాడు. ఇతడి మిత్రులు సన్ పాటిల్, రిత్విక్ రమేష్.. అమెరికాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశారు. పాల వ్యాపారంలో ఏదైనా కొత్తగా చేయాలని కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నారు. దేశంలో పల్లెలు, నగరాలు తేడా లేకుండా పాలకు డిమాండ్ ఉన్న విషయాన్ని గుర్తించారు. అయితే అమెరికా వంటి దేశాల్లో మొక్కల ద్వారా తీసిన పాలను వినియోగిస్తున్నారని, ఈ పాలను వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదని గుర్తించారు. 2020లో ముగ్గురూ కలిసి.. ఆల్ట్ కో అనే వారి కంపెనీని స్థాపించి, వినూత్నంగా ఓట్స్ నుంచి పాలను తయారు చేయడం ప్రారంభించారు.

పట్టాలు విరిగిపోయినట్టు గుర్తించిందో మహిళ.. దూసుకొస్తున్న రైలు.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా..


ముందుగా ఏ మొక్క నుంచి పాలను తయారుచేయాలో ఎంపిక చేసుకుని, పాలు తీయాల్సిన మొక్క భాగాన్ని కనుగొంటారు. అనంతరం దాని గింజలను రుబ్బి.. అందులో కొంత నీరు, ఖనిజాలు జత చేసి మంచి రుచి వచ్చేలా చేస్తారు. తర్వాత నిపుణుల బృందం పరిశీలించి, వాటిని ప్రాసెసింగ్ చేస్తుంది. చివరగా పాలను ప్యాకేజింగ్‌కు పంపుతారు. లాక్టోస్ రహిత పాలు కావడంతో ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఓట్స్ నుంచి పాలను తయారు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో తమ యూనిట్లను ప్రారంభించారు. అలాగే ఈ పాల తయారీకి అవసరమైన పరిశోధన, ప్రాసెసింగ్ పనులు చేసేందుకు వీలుగా నిపుణుల బృందాన్ని నియమించారు.

తల్లి ఆత్మహత్య.. 3 రోజుల తర్వాత వెలుగులోకి 8 ఏళ్ల కూతురి లేఖ.. అందులో ఏం రాసిందో చదివి..


తర్వాత మార్కెటింగ్‌పై దృష్టి సారించి.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యాపారాన్ని విస్తృతం చేశారు. దేశంలోని అనేక నగరాల్లోని రిటైల్ స్టోర్లలో తమ ఉత్పత్తులను కూడా ఉంచారు. అలేగా కంపెనీ పేరుతో వెబ్‍‌సైట్ ప్రారంభించి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కూడా మార్కెటింగ్ చేయడం మొదలెట్టారు. ఒక పాల ప్యాకెట్‌ని రూ.299కి విక్రయిస్తున్నారు. ప్రతి నెలా ఆర్డర్లు పెరుగుతున్నాయని సుమైర్ చెబుతున్నాడు. తమ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 25 నుంచి 30 మిలియన్ డాలర్లు ఉందని తెలిపాడు. ఇందులో ఎక్కువ భాగం సోయా.. తర్వాత స్థానంలో బాదం, ఓట్స్ ఆధారిత పాలు ఉన్నాయని చెప్పాడు.

అబ్బాయి అస్సలు బాగాలేడంటూ పెళ్లిని రద్దు చేసుకున్న 18 ఏళ్ల యువతి.. 13 ఏళ్ల క్రితం తండ్రి చేసిన పనికి..


‘‘దేశంలోని కొన్ని కంపెనీలు సోయా మిల్క్‌ను, మరికొన్ని కంపెనీలు బాదం మిల్క్‌ను తయారు చేస్తున్నాయి. అయితే ఓట్స్‌లో అవసరమైన అన్ని పోషకాలు ఉన్నందున, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్-బి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే దీనిపై దృష్టి పెట్టాం’’.. అని సుమైర్ తెలిపాడు. అయితే ఈ పాల ప్రాసెసింగ్ ఖర్చుతో కూడుకున్నది కావడంతో జంతు ఆధారిత పాల కంటే ఎక్కువ ధర ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ వ్యాపార రంగంలోకి వెళ్లడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదని సుమైర్ పేర్కొన్నాడు.

తాకరాని చోట తాకుతుంటే మొదట అనుమానం రాలేదు.. ఓ రోజు ప్రైవేట్ క్లాసు ఉందంటూ బాలికను గదికి తీసుకెళ్లిన టీచర్..

Updated Date - 2022-04-04T00:15:13+05:30 IST