ప్రతీకాత్మక చిత్రం
మహిళ ఒంటరిగా కనిపిస్తే.. మానప్రాణాలు తీయాలని చూసే రోజులివి. ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. అయితే ప్రస్తుతం దేవాలయాల్లా భావించే పాఠశాలల్లోనూ విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. కొందరు ఉపాధ్యాయులు.. బాలికలు, యువతులను లక్ష్యంగా చేసుకుని, తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ట్యూషన్‌కు వెళ్లిన బాలికపై ట్యూటర్ కన్నేశాడు. రోజూ తాకరాని చోట తాకుతుంటే మొదట అనుమానం కలగలేదు. అయితే ఓ రోజు ప్రైవేట్ క్లాసు ఉందంటూ గదిలోకి తీసుకెళ్లాడు. అసలు ఏం జరిగిందంటే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలిక.. పాఠశాల అనంతరం రోజూ ట్యూషన్‌కి వెళ్తుండేది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్.. అందుకు విరుద్ధంగా ఈ బాలికను టార్గెట్ చేశాడు. చదువు చెప్పే నెపంతో దగ్గరికి వెళ్లి.. తాకరాని చోట తాకేవాడు. అయితే బాలికకు మొదట అనుమానం రాలేదు. దీంతో టీచర్ రోజురోజుకూ ఇంకా ఎక్కువ చేయసాగాడు. కొన్నాళ్లకు బాలికకు ఇబ్బందిగా అనిపించినా.. టీచర్ కావడంతో అలాగే సర్దుకుపోయేది. ఈ క్రమంలో ఓ రోజు ప్రైవేట్ క్లాసు ఉందంటూ బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లాడు. లోపల ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇలా ఆమెపై రోజూ దారుణానికి పాల్పడేవాడు.
ఈ క్రమంలో మార్చి 22న ఆమె గర్భం దాల్చిన సంగతి బయటపడింది. బాలిక తల్లిదండ్రులకు కూడా విషయం తెలిసింది. దీనిపై టీచర్‌తో గొడవపడితే తమ పరువు పోతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. టీచర్‌తో కలిసి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లి, అబార్షన్ చేయించారు. అయితే ఈ విషయం స్థానికులకు తెలియడంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు, బాలిక తల్లిదండ్రులను బుధవారం అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై టీచర్ గత ఏడాది అక్టోబర్ నుంచి ఘాతుకానికి పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసింది. నిందితుడితో పాటూ బాలికకు ఆపరేషన్ చేసిన వైద్యుని కూడా అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి