ఇద్దరు అమ్మాయిలు.. మూడేళ్లుగా స్నేహం.. సడన్‌గా ప్రేమ పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్.. కోర్టుకు చేరిన కథ..!

ABN , First Publish Date - 2022-06-22T00:31:14+05:30 IST

ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటుంటారు..

ఇద్దరు అమ్మాయిలు.. మూడేళ్లుగా స్నేహం.. సడన్‌గా ప్రేమ పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్.. కోర్టుకు చేరిన కథ..!

ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటుంటారు.. ప్రేమ అనేది ఎప్పుడూ ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్యే పుడుతుందా? అప్పుడప్పుడు ఇద్దరమ్మాయిల మధ్య లేదా ఇద్దరబ్బాయిల మధ్య కూడా ప్రేమభావం పుడుతుంటుంది.. ఇటీవలి కాలంలో భారత్‌లో కూడా స్వలింగ వివాహాలు జరుగుతున్నాయి. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరమ్మాయిలు మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తాజాగా వారి ప్రేమకథ కోర్టుకు చేరుకుంది. 


ఇది కూడా చదవండి..

70 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకునేందుకు పేపర్లో ఇచ్చిన ఒక్క ప్రకటనతో రూ.1.80 కోట్లు మటాష్..!


రాజస్థాన్‌లోని నాసిరాబాద్‌కు చెందిన ఇద్దరమ్మాయిల మధ్య మూడేళ్ల క్రితం స్నేహం చిగురించింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గాఢంగా మారింది. పెద్దలు తమ పెళ్లికి ఎలాగూ అంగీకరించరనే కారణంతో వారు రెండున్నర నెలల క్రితం ఇళ్ల నుంచి పారిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు పోలీసులు వారిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. 


తామిద్దరం ఇప్పటికే వివాహం చేసుకున్నామని వారు కోర్టులో చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాలను కూడా చూపించారు. కాగా, ఆ వివాహాన్ని రద్దు చేసుకునేలా అమ్మాయిల కుటుంబాలు ఇద్దరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ అమ్మాయిలు మాత్రం తాము జీవితాంతం కలిసే ఉంటామని చెబుతున్నారు.     

Updated Date - 2022-06-22T00:31:14+05:30 IST