70 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకునేందుకు పేపర్లో ఇచ్చిన ఒక్క ప్రకటనతో రూ.1.80 కోట్లు మటాష్..!

ABN , First Publish Date - 2022-06-21T23:47:53+05:30 IST

అతను మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు..

70 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకునేందుకు పేపర్లో ఇచ్చిన ఒక్క ప్రకటనతో రూ.1.80 కోట్లు మటాష్..!

అతను మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు.. 2019లో అతని భార్య చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు.. ఒంటరితనాన్ని అధిగమించేందుకు 70 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. ఇందుకోసం ఓ ఆంగ్ల దినపత్రికలో పెళ్లికి సంబంధించిన ప్రకటన ఇచ్చాడు.. ఆ ప్రకటనను చూసి క్రిషా శర్మ అనే మహిళ అతనిని కాంటాక్ట్ అయింది.. అతడికి మాయ మాటలు చెప్పి నమ్మించి రూ.1.80 కోట్లు లాగేసింది.. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. 


ఇది కూడా చదవండి..

15 రోజుల క్రితమే డెలివరీ.. భర్త చెప్పాడని పాపతో సహా పుట్టింటికి వెళ్లిన భార్య.. ఫేస్‌బుక్‌లో భర్త పెట్టిన ఓ ఫొటోను చూసి..


లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో నివసిస్తున్న కార్డియాలజిస్ట్ 70 ఏళ్ల వయసులో మళ్లీ చేసుకోవాలనుకున్నాడు. పేపర్లో అతడిచ్చిన ప్రకటన చూసిన క్రిషా శర్మ అనే మహిళ అతడిని కాంటాక్ట్ అయింది. తన వయసు 40 ఏళ్లని, విడాకులు తీసుకున్నానని, దక్షిణాఫ్రికాలో మెరైన్ ఇంజినీర్‌నని చెప్పింది. పెళ్లి  కోసం భారత్‌కు వచ్చి అక్కడే స్థిరపడాలనుకుంటున్నానని చెప్పింది. తను దక్షిణాఫ్రికాలో 7 లక్షల అమెరికన్ డాలర్ల విలువ కలిగిన బంగారాన్ని కొన్నానని, అది అమ్మేసి భారత్‌లో వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పింది. ఆమె మాటలను సదరు కార్డియాలజిస్ట్ నమ్మేశాడు. 


దక్షిణాఫ్రికాకు చెందిన రాయల్ సెక్యూరిటీ కొరియర్ కంపెనీ ఆ బంగారాన్ని భారత్‌కు పంపుతుందని ఆ కార్డియాలజిస్ట్‌కు క్రిషా చెప్పింది. తను వచ్చే లోపు ఆ బంగారాన్ని రిసీవ్ చేసుకోవాలని కోరింది. అప్పట్నుంచి ఆ కార్డియాలజిస్ట్‌కు రాయల్ సెక్యూరిటీ కొరియర్ కంపెనీ టచ్‌లోకి వచ్చింది. పర్మిషన్ ఫీజు, కస్టమ్ డ్యూటీ, ఎఫ్‌టీసీఎల్‌ లైసెన్స్‌, విదేశీయులకు ట్రేడింగ్‌ లైసెన్స్‌ కోసం అంటూ ఆ కార్డియాలజిస్ట్ నుంచి మొత్తం రూ.1.80 కోట్లు లాగేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా అందరి మొబైల్స్ స్విచ్ఛాఫ్ అయిపోయాయి. తను మోసపోయానని గ్రహించిన కార్డియాలజిస్ట్ పోలీసులను ఆశ్రయించాడు.  


Updated Date - 2022-06-21T23:47:53+05:30 IST