Kerala: ఒకేసారి తల్లీ కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. కేరళలో అరుదైన ఘనత!
ABN , First Publish Date - 2022-08-09T15:47:07+05:30 IST
తమ కుటుంబ సభ్యుడు ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం (Government job) సాధిస్తే ఆ కుటుంబం వారి ఆనందానికి అవధులు ఉండవు.

తమ కుటుంబ సభ్యుడు ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం (Government job) సాధిస్తే ఆ కుటుంబం వారి ఆనందానికి అవధులు ఉండవు. ఒకేసారి ఒకే ఇంట్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది తల్లీ కొడుకులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. కేరళ (Kerala)కు చెందిన తల్లీ కొడుకులు ఆ ఘనత సాధించారు. మలప్పురమ్‌కు చెందిన బిందు అనే మహిళ, ఆమె కుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు (Mother and son gets govt jobs together) సాధించి ఔరా అనిపించారు.
ఇది కూడా చదవండి..
Inspirational story: పుట్టగానే ఆ బాలికను పాతిపెట్టేశారు.. బతిక బయటపడిన ఆ బాలిక ఏ స్థాయికి వెళ్లిందంటే..
బిందు అనే మహిళ అంగన్వాడీ టీచర్‌గా పని చేసేది. పదో తరగతి చదువుతున్న తన కుమారుడిని ప్రోత్సహించేందుకు బిందు కూడా పుస్తకాలు చదవడం ప్రారంభించింది. క్రమంగా వాటి మీద ఆసక్తి పెంచుకుని కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Kerala Public Service Commission) కోసం సిద్ధమవడం మొదలుపెట్టింది. కోచింగ్ సెంటర్లో జాయిన్ అయింది. పలు పోటీ పరీక్షలు రాసింది. తొమ్మిదేళ్ల పాటు కష్టపడి చదివి 42 ఏళ్ల వయసులో లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(ఎల్జీఎస్) పరీక్షలో 92వ ర్యాంకు సాధించింది.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొడుకును కూడా బిందు తనతో పాటు కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసింది. ఇద్దరూ కష్టపడి చదివేవారు. తాజాగా జరిగిన పరీక్షలో 24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్ డివిజనల్ క్లర్క్(ఎల్డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్ సాధించాడు. దీంతో ఆ కుటంబంలో సంతోషం వెల్లివిరిసింది.