Viral Video: వివాహ వేడుకలో వధువు ట్యాలెంట్‌కు ఫిదా.. వరుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-12-27T14:58:09+05:30 IST

పెళ్లి అనగానే అమ్మాయిలు సిగ్గుల మొగ్గలవుతారు. ఎంతో బిడియంగా పెళ్లి వేడుకలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. సంగీత్ పేరుతో వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తున్నారు. వరుడు, బంధుమిత్రులతో కలిసి ఆడి పాడుతున్నారు.

Viral Video: వివాహ వేడుకలో వధువు ట్యాలెంట్‌కు ఫిదా.. వరుడు ఏం చేశాడంటే..

పెళ్లి అనగానే అమ్మాయిలు సిగ్గుల మొగ్గలవుతారు. ఎంతో బిడియంగా పెళ్లి వేడుకలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. సంగీత్ పేరుతో వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తున్నారు. వరుడు, బంధుమిత్రులతో కలిసి ఆడి పాడుతున్నారు. తాజాగా కేరళలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఓ వధువు అత్యద్భుతంగా డ్రమ్స్ (Kerala Bride Plays Chenda) వాయించింది. వధువు ట్యాలెంట్‌కు మిగతా వారితో పాటు వరుడు కూడా ఫిదా అయ్యాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

@LHBCoach అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో వధువు చెండా (Chenda) అనే కేరళ సంగీత వాయిద్యాన్ని బృందంతో కలిసి వాయిస్తోంది. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఆమె వివాహం జరుగుతోంది. అదే ఆలయంలో ఆమె తండ్రి చాలా ఏళ్లుగా చెండా మాస్టర్‌గా పని చేస్తున్నాడు. వివాహ సమయంలో వధువు.. తండ్రి సంగీత పరికరంతో తన ట్యాలెంట్‌ను చూపెట్టింది. వీడియో చివర్లో వధువు తండ్రి, వరుడు కూడా ఆమెతో జాయిన్ అయ్యారు. ఈ వీడియో ఇప్పటికే 48,000 వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2022-12-27T14:58:11+05:30 IST