మోదీ ప్రభుత్వం కొత్త పథకం.. రూ.2.20లక్షలు నేరుగా మహిళల అకౌంట్లోకి? ఇది నిజమేనా అంటే..

ABN , First Publish Date - 2022-12-10T11:33:09+05:30 IST

ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరొ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టుగా సోషల్ మీడియా వేదికగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దేశంలోని మహిళలకు కొత్త స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.2.20లక్షల ఆర్థిక సహాయం(Financial Assistance..

మోదీ ప్రభుత్వం కొత్త పథకం.. రూ.2.20లక్షలు నేరుగా మహిళల అకౌంట్లోకి? ఇది నిజమేనా అంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీ(PM Modi) నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరొ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టుగా సోషల్ మీడియా వేదికగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దేశంలోని మహిళలకు కొత్త స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.2.20లక్షల ఆర్థిక సహాయం(Financial Assistance) చేస్తుందనేది ఆ వార్త సారాంశం. దీంతో చాలా మంది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఆ వార్తను ఇతరలకు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మోదీ ప్రభుత్వం నిజంగానే అలాంటి పథకాన్ని ప్రారంభించిందా? ఈ వార్తలో నిజం ఎంత అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

‘మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రూ.2.20లక్షల ఆర్థిక సహాయాన్ని చేయాలని డిసైడ్ అయింది. ఆ మొత్తాన్ని నెల నెలా అందించేందుకు ‘ప్రధాన్ మంత్రి నారీ శక్తి యోజన’ పథకాన్ని ప్రవేశ పెట్టింది’ అనే వార్త సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌ చానాళ్ల ద్వారా వైరల్ అవుతోంది. దీంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తలో(PM Nari Shakti Yojana) వాస్తవం లేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అలాంటి వార్తలను అస్సలు నమ్మవద్దని సూచించింది. అంతేకాకుండా ఆ వీడియోల్లో వ్యక్తులు చెప్పినట్టుగా ఏ వెబ్‌సైట్లనూ సందర్శించొద్దని తేల్చి చెప్పింది. అలా చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం చోరీ అవడంతోపాటు.. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్లను సందర్శించాలని కోరింది.

Updated Date - 2022-12-10T11:39:01+05:30 IST