-
-
Home » Prathyekam » Instagram rewards Jaipur student with Rs 38 lakh for finding a bug sgr spl-MRGS-Prathyekam
-
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌ను కనుగొన్న జైపూర్ విద్యార్థి.. రూ.38 లక్షల రివార్డుతో సత్కారం!
ABN , First Publish Date - 2022-09-19T23:44:11+05:30 IST
కోట్లాది మంది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కాకుండా కాపాడినందుకు జైపూర్‌కు చెందిన నీరజ్ శర్మ అనే విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్

కోట్లాది మంది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కాకుండా కాపాడినందుకు జైపూర్‌కు చెందిన నీరజ్ శర్మ అనే విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సంస్థ రూ.38 లక్షల బహుమతిని అందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఓ బగ్ (Bug)ను ఈ ఏడాది మే నెలలో నీరజ్ కనుగొన్నాడు. ఆ బగ్ ఉపయోగించి లాగిన్, పాస్‌వర్డ్ లేకుండానే ఎవరి అకౌంట్‌కు సంబంధించిన థంబ్ నెయిల్‌ను అయినా మార్చవచ్చు. నీరజ్ ఆ బగ్‌ను గుర్తించి వెంటనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాజమాన్యానికి తెలియజేశాడు.
ఇది కూడా చదవండి..
Viral Video: కబడ్డీ ఆడుతున్న ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసాన్ని చూస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో!
`ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బగ్‌ను గుర్తించాను. దాని ద్వారా ఇన్‌స్టా రీల్ థంబ్ నెయిల్‌ను ఏదైనా ఖాతా నుంచి సులభంగా మార్చవచ్చు. ఖాతాదారుడి పాస్‌వర్డ్ ఎంత బలంగా ఉన్నా ఉపయోగం లేదు. వ్యక్తి ఐడీ తెలిస్తే సరిపోతుంది. జనవరి 31 ఉదయం, ఇన్‌స్టాగ్రామ్ బగ్ గురించి నాకు తెలిసింది. వెంటనే నేను వారికి ఒక నివేదిక పంపాను. మూడు రోజుల తర్వాత వారి నుంచి సమాధానం వచ్చింది. డెమోను షేర్ చేయమని కోరారు. నేను చూపించిన తర్వాత వారు నా నివేదిక నిజమేనని గుర్తించార`ని నీరజ్ పేర్కొన్నాడు.
బగ్‌ను కనుగొన్నందుకు 45,000 డాలర్లు (సుమారు రూ. 35 లక్షలు) రివార్డు (Instagram rewards Jaipur student) ఇస్తున్నట్టు మే 11 రాత్రి నీరజ్‌కు ఫేస్‌బుక్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. దాదాపు నాలుగు నెలల అనంతరం నీరజ్‌కు రివార్డు అందింది. అలాగే, రివార్డ్ ఇవ్వడంలో నాలుగు నెలల జాప్యానికి బదులుగా, ఫేస్‌బుక్ కూడా $ 4500 (దాదాపు రూ. 3 లక్షలు) బోనస్‌గా ఇచ్చింది.