Viral Video: కబడ్డీ ఆడుతున్న ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసాన్ని చూస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-09-19T23:17:07+05:30 IST

పెద్ద పెద్ద సమస్యల్ని ఎదుర్కోవడానికి కావల్సింది వయసు, అనుభవం కాదు.

Viral Video: కబడ్డీ ఆడుతున్న ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసాన్ని చూస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో!

పెద్ద పెద్ద సమస్యల్ని ఎదుర్కోవడానికి కావల్సింది వయసు, అనుభవం కాదు. తన మీద తనకి నమ్మకం, ఆత్మవిశ్వాసం అని నిరూపించాడు ఓ బుడతడు. కబడ్డీ ఆటలో ఆ కుర్రాడు చూపిన స్ఫూర్తి ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఓ చిన్న పిల్లాడు పెద్దవాళ్లతో కలిసి కబడ్డీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. కబడ్డీ ప్రేమికులను ఆ వీడియో బాగా ఆకట్టుకుంటోంది.


ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ప్రహ్లాద్ మీనా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కబడ్డీ మ్యాచ్ జరుగుతోంది. ఒక టీమ్‌లో ఉన్న ఓ చిన్న పిల్లవాడు ఎంతో ఉత్సాహంతో ఆడుతున్నాడు. తనకంటే మూడింతల హైట్ ఉన్న వ్యక్తి కూతకు వచ్చినప్పుడు ఆ చిన్నారి అతడిని పట్టుకున్న తీరు చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-09-19T23:17:07+05:30 IST