ఇంట్లోనే శవాన్ని పూడ్చేశాడు.. ఫోన్‌ను కంటైనర్‌పై పడేశాడు.. అన్నీ దృశ్యం సినిమాలో చూపించినట్టే చేశాడు కానీ..

ABN , First Publish Date - 2022-08-17T22:06:31+05:30 IST

దృశ్యం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అనుకోని సందర్భంలో తమని తాము కాపాడుకునే క్రమంలో హీరో భార్య, కూతురు ఓ హత్య చేస్తారు. వారిని కాపాడుకోవడం కోసం హీరో.. తన..

ఇంట్లోనే శవాన్ని పూడ్చేశాడు.. ఫోన్‌ను కంటైనర్‌పై పడేశాడు.. అన్నీ దృశ్యం సినిమాలో చూపించినట్టే చేశాడు కానీ..

దృశ్యం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అనుకోని సందర్భంలో తమని తాము కాపాడుకునే క్రమంలో హీరో భార్య, కూతురు ఓ హత్య చేస్తారు. వారిని కాపాడుకోవడం కోసం హీరో.. తన తెలివితేటలు ఉపయోగించి మృతదేహాన్ని ఏకంగా పోలీస్ స్టేషన్‌లో పాతిపెట్టి, అతడి మొబైల్‌ను లారీలో పడేస్తాడు. తద్వారా పోలీసులను తప్పుదారి పట్టించడం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. రాజస్థాన్‌లో తాజాగా కొందరు ఇలాంటి పనే చేశారు. అయితే చివరకు వారి ప్లాన్ మాత్రం బెడిసికొట్టింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం అల్వార్‌కు చెందిన మంగత్ అరోరా అనే వ్యక్తి స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో చాలా మందికి అప్పులు ఇచ్చాడు. కొన్ని నెలల కిందట రేవారికి చెందిన చిత్తుకాగితాల వ్యాపారి అంకిత్ భలియా అనే వ్యక్తి.. మంగత్ వద్ద రూ.35 లక్షలు తీసుకున్నాడు. అయితే తర్వాత తీర్చడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మంగత్‌పై అంకిత్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అంతమొందిచాలని కుట్ర పన్నాడు. ఇదే విషయమై తన స్నేహితులైన దీపక్ అలియాస్ దీపు, మనోజ్‌ అనే వ్యక్తులతో మాట్లాడాడు. హత్య చేసేందుకు గాను వారికి రూ.3లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నాడు.

husband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..


అయితే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వివిధ రకాలుగా ఆలోచించారు. చివరకు వారికి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgn) చిత్రం దృశ్యం సినిమా (Drushyam movie) గుర్తుకొచ్చింది. అందులో లాగానే మంగత్‌ను హత్య చేయాలని పథకం పన్నారు. అనుకున్న విధంగా జూలైలో ముగ్గురూ కలిసి రేవారిలోని అంకిత్ గోదాములో గొయ్యి తవ్వి పెట్టుకున్నారు. ఆగస్టు 10న మంగత్‌కు ఫోన్ చేసి తమ గోదాము వద్దకు పిలిచారు. అక్కడికి వచ్చిన మంగత్‌ను ముగ్గురూ కలిసి గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోదాము మధ్యలో ఉన్న గుంతలో పూడ్చిపెట్టారు. అతడి బైకును రేవూరికి 70 కిలోమీటర్ల దూరంలోని తవడులో పార్కు చేశారు. తర్వాత మంగత్ మొబైల్‌ను ఓ కంటైనర్‌లో పడేసి వెళ్లిపోయారు.

అర్ధరాత్రి girlfriend ఇంటికి వెళ్లిన ప్రియుడు.. యువతి నిద్రలో ఉందని తెలుసుకుని.. చివరకు..


మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు.. మిస్సింగ్ కేసు (Missing case) నమోదు చేసుకున్న పోలీసులు.. మంగత్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. ఆగస్టు 14న రాత్రి కంటైనర్‌లో ఉన్న ఫోన్‌ను ధర్మ అనే డ్రైవర్ గుర్తించాడు. అదే సమయంలో మంగత్ స్నేహితులు ఫోన్ చేయగా కంటైనర్‌ డ్రైవర్ ధర్మ మాట్లాడాడు. తద్వారా డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించగా.. రేవారి ప్రాంతంలో మృతుడు బైకులో వెళ్తూ కనిపించాడు. చివరకు మనోజ్, దీపక్‌ను విచారించగా నేరం అంగీకరించారు. ఆగస్టు 15న అంకిత్‌ను కూడా అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

హోటల్‌లో ఉన్న young woman.. కాసేపటికి కారులో ప్రత్యక్షం.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. అని ప్రియుడిని అడగడంతో..Read more