పోలీస్ స్టేషన్ ఎదుటే యువతి కిడ్నాప్.. ఆమెను తీసుకెళ్లింది ఎవరో తెలిసి పోలీసులు షాక్!

ABN , First Publish Date - 2022-10-18T00:15:23+05:30 IST

ఆ యువతి వయసు 19 సంవత్సరాలు.. నాలుగేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది..

పోలీస్ స్టేషన్ ఎదుటే యువతి కిడ్నాప్.. ఆమెను తీసుకెళ్లింది ఎవరో తెలిసి పోలీసులు షాక్!

ఆ యువతి వయసు 19 సంవత్సరాలు.. నాలుగేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది.. తల్లిదండ్రులకు తెలియకుండా అతడిని వివాహం చేసుకుంది.. తనకు రక్షణ కావాలని కోరేందుకు భర్త, అతని కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. ఇలా పోలీస్ స్టేషన్‌లోకి ఆమె ఎంటర్ కాగానే ఓ కారు వేగంగా లోపలికి దూసుకెళ్లి ఆ యువతిని ఎక్కించుకుని అంతే వేగంగా బయటకు వెళ్లిపోయింది.. అంతా రెప్పపాటు కాలంలో జరగడంతో పోలీసులకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు.. రాత్రి సమయంలో తిరిగి వచ్చిన యువతి చెప్పింది విని పోలీసులు కూడా షాకయ్యారు. 


ఇది కూడా చదవండి..

Chandigarh: 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడు.. కోర్టు అతనికి ఎలాంటి శిక్ష విధించిందంటే..


ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో కుటుంబ సభ్యులు తమ సొంత కూతురిని పోలీస్‌స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశారు. 19 ఏళ్ల యువతి తన భర్తతో కలిసి వాంగ్మూలం ఇచ్చేందుకు పోలీసుల వద్దకు వచ్చింది. ఆ సమయంలో తెలుపు రంగు కారు అతివేగంతో పోలీస్ స్టేషన్‌ లోపలికి వెళ్లింది. అందులో ఉన్న వారు యువతిని బలవంతంగా కారు ఎక్కించారు. ఎవరికీ అర్థం కాకముందే ఆ కారు అదే వేగంతో పోలీస్ స్టేషన్ ఆవరణలోంచి బయటకు వెళ్లిపోయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో బిలారా పోలీస్ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. పోలీసులు, ఆ యువతి భర్త ఆ కారును కొద్ది దూరం వెంబడించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. 


ఆ యువతి తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా తన ప్రియుడిని గత శనివారం వివాహం చేసుకుంది. అనంతరం తన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కోసం పోలీసుల వద్దకు వెళ్లాలనుకుంది. ఆ విషయం ఆ బాలిక తండ్రికి, సోదరుడికి తెలిసింది. వారు ఆమెను కిడ్నాప్ చేశారు. చివరకు ఏం జరిగిందో ఏమో, రాత్రి సమయంలో ఆమెను పోలీస్ స్టేషన్ వద్దే వదిలేసి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-10-18T00:15:23+05:30 IST