Chandigarh: 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడు.. కోర్టు అతనికి ఎలాంటి శిక్ష విధించిందంటే..
ABN , First Publish Date - 2022-10-17T21:38:38+05:30 IST
ఆ మహిళ వయసు 60 సంవత్సరాలు.. మానసిక సమస్యలతో బాధపడుతోంది..
ఆ మహిళ వయసు 60 సంవత్సరాలు.. మానసిక సమస్యలతో బాధపడుతోంది.. కొడుకుతో కలిసి నివసిస్తోంది.. అదే కాలనీలో నివసిస్తున్న ఓ 27 ఏళ్లు యువకుడు 2018 మే నెలలో ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ మహిళ కేకలు విన్న ఓ బాలుడు ఆ ఘటన మొత్తాన్ని తన మొబైల్ ఫోన్లో బంధించాడు.. ఆ కేసు విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తాజాగా తుదితీర్పు వెలువరించింది.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఇది కూడా చదవండి..
సైకో భర్త శాడిజం.. తొలి రేయి నుంచే నరకం.. హోటళ్లో స్నేహితులు, వారి భార్యలతో కలిసి..
ఉత్తరాఖండ్‌కు చెందిన సందీప్ సింగ్ రాణా అనే వ్యక్తి చండీగఢ్‌లోని కిషన్గఢ్లో ఉంటున్నాడు. 2018 మే నెలలో తన ఉంటున్న ప్రాంతానికి సమీపంలో ఉంటున్న ఓ 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మానసిక వికలాంగురాలైన బాధిత మహిళ తన కొడుకుతో కలిసి నివసిస్తోంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే సమయంలో పక్కింటి బాలుడు కిటికీ నుంచి ఆ దృశ్యాలను మొబైల్లో బంధించాడు. సాయంత్రం డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన కొడుకు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వృద్ధురాలిని మెడికల్ పరీక్షలకు పంపి ఆమెపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారించుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. బాలుడు తీసిన వీడియోను సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. సుదీర్ఘ కాలం విచారించిన కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విచారణ సమయంలోనే 60 ఏళ్ల బాధితురాలు మరణించింది.