ఐదో అంతస్తు ఎక్కి.. చిట్టచివరన కూర్చుని దూకేస్తానంటూ భార్య బెదిరింపులు.. పోలీసులు వచ్చి కారణం అడిగితే ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-06-30T02:52:59+05:30 IST

కొందరు మహిళలు విచిత్రమైన కోరికలు కోరుతూ భర్తలను ఇబ్బంది పెడుతుంటారు. మరికొందరు మహిళలు.. తమ అమాయకత్వం, అనాలోచిత నిర్ణయాల కారణంగా అందరికీ ఇబ్బందులు తెచ్చిపెడుతుంటారు. హర్యానాలో ఇటీవల..

ఐదో అంతస్తు ఎక్కి.. చిట్టచివరన కూర్చుని దూకేస్తానంటూ భార్య బెదిరింపులు.. పోలీసులు వచ్చి కారణం అడిగితే ఆమె చెప్పింది విని..

కొందరు మహిళలు విచిత్రమైన కోరికలు కోరుతూ భర్తలను ఇబ్బంది పెడుతుంటారు. మరికొందరు మహిళలు.. తమ అమాయకత్వం, అనాలోచిత నిర్ణయాల కారణంగా అందరికీ ఇబ్బందులు తెచ్చిపెడుతుంటారు. హర్యానాలో ఇటీవల ఇలాగే జరిగింది. ఓ మహిళ తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు పైకి ఎక్కింది. భవనం చివరన కూర్చుని దూకేస్తానంటూ అందరినీ బెదిరించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. కారణం ఏంటని అడిగితే.. ఆమె ఇచ్చిన సమాధానం విని, అంతా అవాక్కయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‍‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న భార్యాభర్తల మధ్య విచిత్రమైన సమస్య తలెత్తింది. ఆ దంపతుల మధ్య ఇప్పటివరకూ ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల భర్తను.. భార్య ఓ కోరిక కోరింది. రాజస్థాన్‌లోని ఖాతు శ్యామ్ జీ అనే బాబా దర్శనానికి తీసుకెళ్లాలని అడిగింది. అయితే భర్తకు వివిధ పనులు ఉండడంతో వాయిదా వేస్తూ వస్తున్నాడు. భార్య మాత్రం పదే పదే అదే కోరిక కోరుతూ ఉండేది. రేపు, మాపు అంటూ భర్త సర్దిచెబుతూ వచ్చాడు. నెలలు గడుస్తున్నా తనను బాబా దర్శననానికి తీసుకెళ్లకపోవడంతో ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఇలాగైతే భర్త తన మాట వినడు అనుకుందో.. ఏమో గానీ.. చివరకు వారు ఉంటున్న అపార్ట్‌మెంట్ 5వ అంతస్తు పైకి ఎక్కింది.

కడుపునొప్పి అని కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్తే గర్భవతి అని చెప్పిన డాక్టర్లు.. ఏం జరిగిందని ఆ తల్లి ఏడుస్తూ అడిగితే..


భవనం చివరన కూర్చుని, దూకేస్తానంటూ అరవడం మొదలెట్టింది. దీంతో స్థానికులంతా అక్కడ గుమికూడారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా ఆమె మాత్రం కిందకు దిగలేదు. చివరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎలాగోలా ఆమెకు నచ్చజెప్పి కిందకు దింపారు. తర్వాత కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఇంత రాద్దాంతం చేయకూడదంటూ సూచించారు. అంతా కలిసి మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని చెప్పారు. ఎట్టకేలకు సమస్య సర్దుమణగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

విపరీతంగా మద్యానికి అలవాటు పడిన భార్య.. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేకపోవడంతో ఆ భర్త ఏం చేశాడంటే..

Updated Date - 2022-06-30T02:52:59+05:30 IST