కడుపునొప్పి అని కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్తే గర్భవతి అని చెప్పిన డాక్టర్లు.. ఏం జరిగిందని ఆ తల్లి ఏడుస్తూ అడిగితే..

ABN , First Publish Date - 2022-06-30T01:25:50+05:30 IST

కొందరు కామాంధులు పెద్దా చిన్నా, వావివరుసలు మరచి.. మహిళలందరినీ వక్ర దృష్టితో చూస్తుంటారు. ఇంకొందరు ప్రబుద్ధులైతే సొంత కుటుంబ సభ్యులపైనే అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల దారుణం..

కడుపునొప్పి అని కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్తే గర్భవతి అని చెప్పిన డాక్టర్లు.. ఏం జరిగిందని ఆ తల్లి ఏడుస్తూ అడిగితే..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు కామాంధులు పెద్దా చిన్నా, వావివరుసలు మరచి.. మహిళలందరినీ వక్ర దృష్టితో చూస్తుంటారు. ఇంకొందరు ప్రబుద్ధులైతే సొంత కుటుంబ సభ్యులపైనే అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల దారుణం జరిగింది. కడుపు నొప్పి రావడంతో కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. బాలిక గర్భంతో ఉందని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన తల్లి.. ఏం జరిగిందంటూ ఏడుస్తూ కూతురుని అడిగింది. చివరికి ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు.. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అమ్రోహా జిల్లాకు చెందిన 50ఏళ్ల వ్యక్తి.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నేళ్లు కుటుంబాన్ని బాగా చూసుకున్న వ్యక్తిలో రాను రాను దుర్మార్గుడు నిద్రలేచాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతురిని వక్ర దృష్టితో చూడడం మొదలెట్టాడు. ఇంట్లో కూతురు ఒంటరిగా ఉన్న సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. బాలికకు మొదట అర్థం కాలేదు.. కానీ ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై బలత్కారం చేశాడు. ఇంట్లో ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇలా ఏడు నెలలుగా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

విపరీతంగా మద్యానికి అలవాటు పడిన భార్య.. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేకపోవడంతో ఆ భర్త ఏం చేశాడంటే..


పరీక్షించిన వైద్యులు.. బాలిక ఏడు నెలల గర్భంతో ఉందని తెలిపారు. దీంతో షాకైన తల్లి.. బాలికను గట్టిగా నిలదీయడంతో విషయం బయటపడింది. తర్వాత జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జూన్ 15న నిందితుడిని అరెస్ట్ చేశారు. 20న కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా.. ఈ కేసుపై కేవలం ఆరు రోజుల్లోనే న్యాయస్థానం.. నిందితుడిని దోషిగా నిర్ధారించింది. బాధితురాలి తండ్రికి రూ.53వేల జరిమానాతో పాటూ జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్చు ఇచ్చారు. చార్జిషీట్‌ దాఖలు చేసిన ఆరు రోజుల్లోనే దోషికి శిక్ష విధించడం.. రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని పోలీసులు తెలిపారు.

కొన్ని నెలల అనంతరం భార్యను చూసేందుకు ఇంటికొచ్చిన భర్త.. తన విషయం బయట చెబితే చంపేస్తానన్న భార్య.. చివరకు ఏం చేసిందంటే..

Updated Date - 2022-06-30T01:25:50+05:30 IST