Google Manager: గూగుల్ ఉన్నతోద్యోగి కిడ్నాప్.. బలవంతంగా వివాహం జరిపించి ఆ తర్వాత ఏం చేశారంటే..
ABN , First Publish Date - 2022-10-16T17:44:00+05:30 IST
భోపాల్‌లోని కమలానగర్ ప్రాంతంలో గూగుల్ మేనేజర్‌ను బందీగా ఉంచి మహిళతో బలవంతంగా వివాహం జరిపించిన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది.
భోపాల్‌లోని కమలానగర్ ప్రాంతంలో గూగుల్ మేనేజర్‌ను బందీగా ఉంచి మహిళతో బలవంతంగా వివాహం జరిపించిన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు గణేష్ శంకర్ బెంగళూరులోని గూగుల్‌లో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అతను IIM షిల్లాంగ్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) చదువుతున్న సమయంలో భోపాల్‌కు చెందిన సుజాత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ తరచుగా మాట్లాడుకునేవారు.
ఇది కూడా చదవండి..
ఇంటి నుంచి అదృశ్యమై రైలెక్కిన 16 ఏళ్ల బాలిక.. అనుమానంతో ప్రశ్నించిన టీటీఈ ఆమె చెప్పిన సమాధానం విని..
ఇటీవల సుజాత మాట్లాడుకుందామంటూ గణేష్‌ను భోపాల్‌కు పిలిపించింది. సుజాత కుటుంబ సభ్యులు గణేష్‌కు బలవంతంగా మత్తు మందు ఇచ్చి బందీగా ఉంచారు. అనంతరం గణేష్ చేత బలవంతంగా సుజాత మెడలో తాళి కట్టించారు. ఫొటోలు, వీడియోలు తీశారు. వాటి ఆధారంగా బ్లాక్‌మెయిల్‌కు దిగారు. రూ. 40 లక్షలు ఇవ్వకుంటే తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.