అత్తమామలు, భార్య వేధింపులు.. విసుగు చెందిన ఆ యువకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే..

ABN , First Publish Date - 2022-08-16T22:08:46+05:30 IST

ఆ యువకుడికి ఏడాది క్రితం వివాహమైంది.. పెళ్లైన కొన్నాళ్లకే భార్య పట్టు పట్టడంతో వేరే కాపురం పెట్టాడు..

అత్తమామలు, భార్య వేధింపులు.. విసుగు చెందిన ఆ యువకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే..

ఆ యువకుడికి ఏడాది క్రితం వివాహమైంది.. పెళ్లైన కొన్నాళ్లకే భార్య పట్టు పట్టడంతో వేరే కాపురం పెట్టాడు.. అప్పట్నుంచి అతనికి కష్టాలు మొదలయ్యాయి.. భార్య, అత్త మామలు అతడిని వేధించడం ప్రారంభించారు.. తమకు డబ్బులు కావాలని తరచుగా అతడి నుంచి తీసుకునేవారు.. పాత ఇల్లు అమ్మేసి కొత్త ఇల్లు కొనాలని డిమాండ్ చేసేవారు.. వారి తీరుతో విసుగు చెందిన ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. హర్యానా (Haryana)లోని రోహ్‌తక్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

HARYANA: భార్యతో మూడ్రోజులుగా గొడవ.. చివరకు ఆ భర్త ఎంత పని చేశాడంటే..


రోహ్‌తక్ జిల్లాలోని కలనౌర్‌లో జనరల్ స్టోర్స్ నడుపుకుంటున్న గగన్ అనే యువకుడికి గతేడాది అంజలి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లి జరిగి ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే గగన్‌ను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి అంజలి వేరే కాపురం పెట్టించింది. అప్పట్నుంచి డబ్బుల కోసం భర్తను వేధించడం ప్రారంభించింది. గగన్ నుంచి తరచుగా డబ్బులు తీసుకుని తల్లిదండ్రులకు పంపించేది. వారు కూడా అల్లుడిని తరచుగా డబ్బులు అడిగేవారు. కొన్ని రోజులుగా అంజలి కొత్త ఇంటి కోసం గొడవ చేయడం ప్రారంభించింది. గగన్ తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని అమ్మేసి కొత్త ఇల్లు కొనాలనేది అంజలి ప్లాన్. 


కొత్త ఇంటి విషయమై అంజలి, ఆమె తల్లిదండ్రులు గగన్‌ను తరచుగా ప్రశ్నించేవారు. అందుకు గగన్ నిరాకరించాడు. దీంతో అంజలి భర్త మీద అలిగి రాఖీ పండగ రోజు పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో గగన్ మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి తన తల్లికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. తర్వాతి రోజు ఉదయం ఆమె వెళ్లి చూసేసరికి గగన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, అత్తమామల వేధింపుల వల్లే గగన్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-08-16T22:08:46+05:30 IST