Earning lakhs with Carrots: క్యారెట్లతో నెలకు రూ.10 లక్షల సంపాదన.. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా..?

ABN , First Publish Date - 2022-12-30T15:51:39+05:30 IST

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లా.. పంజాబ్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ జిల్లాను రాజస్థాన్ అన్నదాత అని, ఆహార ధాన్యాల గిన్నె అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఈ ఎడారి ప్రాంతం క్షామంతో విలవిలలాడేది. అలాంటిది ఇందిరా గాంధీ కెనాల్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చింది.

Earning lakhs with Carrots: క్యారెట్లతో నెలకు రూ.10 లక్షల సంపాదన.. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా..?

రాజస్థాన్‌లోని (Rajasthan) శ్రీ గంగానగర్ జిల్లా.. పంజాబ్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ జిల్లాను రాజస్థాన్ అన్నదాత అని, ఆహార ధాన్యాల గిన్నె అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఈ ఎడారి ప్రాంతం క్షామంతో విలవిలలాడేది. అలాంటిది ఇందిరా గాంధీ కెనాల్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చింది. ఆ తర్వాత ఈ ప్రాంతం నేల గోధుమలు, శనగలు, చెరకును పుష్కలంగా ఉత్పత్తి చేసింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడి రైతులు సంప్రదాయ వ్యవసాయం నుంచి లాభసాటి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం క్యారెట్లకు (Carrots) అడ్డాగా మారింది.

ఈ మార్కెట్‌లో అతిపెద్ద క్యారెట్ వ్యాపారి రాకేష్ బెనివాల్. పంజాబ్‌లోని రూప్‌నగర్ గ్రామానికి చెందిన రాకేష్ ఈ గంగానగర్ జిల్లాలో 100 ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని క్యారెట్ పండిస్తున్నాడు. దాదాపు 11 ఏళ్లుగా రాకేష్ క్యారెట్ సాగు చేస్తున్నాడు. గంగానగర్ క్యారెట్‌కు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీంతో రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి క్యారెట్ పంటకు మారారు. 2011 వరకు తాను గోధుమ పండించేవాడినని, అయితే ఆదాయం పెద్దగా వచ్చేది కాదని రాకేష్ చెప్పాడు. ఆ తర్వాత క్యారెట్ సాగు ప్రారంభించానని, 3 నెలల్లోనే పంట చేతికి వస్తుండడంతో పాటు మంచి ఆదాయం కూడా వస్తోందని తెలిపాడు.

3 నెలల్లో 70 వేల నుంచి 1.5 లక్షల ఆదాయం సమకూరుతోంది. క్యారెట్ తూకం, రేటు బాగుంటే, రైతు ఆదాయం మూడు రెట్లు పెరుగుతుంది. క్యారెట్ అమ్మేటపుడు మధ్యవర్తులు ఎవరూ ఉండరు. నేరుగా మండికి తీసుకెళ్తే మీ క్యారెట్ నాణ్యతను బట్టి రేటు నిర్ణయిస్తారు. క్యారెట్‌లో చాలా తక్కువ ఎరువులు, పురుగుమందులు వేయాలి. యూరియా తప్ప మరేమీ వేయకూడదు. అందుకే పెద్దగా ఖర్చు ఉండదు. ఒక ఎకరం క్యారెట్‌తో మూడు నెలలకు 1.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం 45 ఎకరాల్లో పంట వేశాను. కాబట్టి నా ఆదాయం మూడు నెలలకు ప్రతి నెలా 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుందని రాకేష్ తెలిపాడు.

Updated Date - 2022-12-30T20:43:14+05:30 IST