Viral Video: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పోలీస్.. ఆ తర్వాత అతడు చేసిన పనికి..

ABN , First Publish Date - 2022-12-15T10:49:44+05:30 IST

ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో అంతటా తెలిసిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోలీసు..

Viral Video: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పోలీస్.. ఆ తర్వాత అతడు చేసిన పనికి..

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో అంతటా తెలిసిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోలీసు అధికారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. లంచం తీసుకుంటూ ఓ పోలీసు అధికారి విజిలెన్స్ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ తర్వాత అతడు చేసిన పనికి అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూసి నెటిజన్లు కూడా కంగుతింటున్నారు. ఇంతకూ అసలు విషయం ఏంటంటే..

మహేంద్ర అనే పోలీసు అధికారి హర్యానా(Haryana)లోని ఫరిదాబాద్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ బాధితుడు తన గేదె దొంగతనానికి గురైందంటూ మహేంద్రకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన దొంగతనం చేసిన వ్యక్తిని గుర్తించాడు. అనంతరం ఈ కేసును సెటిల్ చేయడానికి రూ.10వేలను డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే దొంగతనం చేసిన వ్యక్తి నుంచి రూ.6వేలు ముందుగానే తీసుకున్నాడు. అనంతరం బుధవారం రోజు రూ.4వేలు తీసుకుంటూ ఉండగా.. సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు మహేంద్రను చుట్టుముట్టారు. విజిలెన్స్ అధికారుల ఎంట్రీతో షాకైన మహేంద్ర.. తన చేతిలో ఉన్న డబ్బును నోట్లో(Cop Tries To Swallow Cash) పెట్టుకున్నాడు. వెంటనే విజిలెన్స్ అధికారులు.. అతడి నోట్లో నుంచి డబ్బును బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ.. మహేంద్ర అప్పటికే ఆ నోట్లను మింగేశాడు. ఈ దృశ్యాలను స్థానికులు కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. మహేంద్రను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-12-15T10:49:47+05:30 IST