కేన్సర్ పేరుతో మోసం.. ఫండ్ రైజింగ్ ద్వారా రూ.43 లక్షల వసూలు.. చివరకు ఆమెకు విధించిన శిక్షేంటంటే..
ABN , First Publish Date - 2022-07-01T02:42:42+05:30 IST
కష్టపడి సంపాదించడం కంటే మోసం చేసి సులభంగా లక్షలకు లక్షలు పోగేసుకోవాలని ఆలోచించేవాళ్లకు ఈ రోజుల్లో కొదువ లేదు.

కష్టపడి సంపాదించడం కంటే మోసం చేసి సులభంగా లక్షలకు లక్షలు పోగేసుకోవాలని ఆలోచించేవాళ్లకు ఈ రోజుల్లో కొదువ లేదు. బ్రిటన్కు చెందిన ఓ మహిళ కేన్సర్ డ్రామా ఆడి లక్షలు సంపాదించింది. నమ్మిన వాళ్లను మోసం చేసి ఏకంగా రూ.43 లక్షలు కాజేసింది. జల్సాగా గడిపేసి మొత్తం డబ్బులను ఖర్చు పెట్టేసింది. చివరకు నేరం రుజువు కావడంతో ఆమెకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.500 మాత్రమే తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి..
Viral Video: ఓరి నాయనో.. ఒక్క బైక్పై ఏడుగురా..? ఒకరి తర్వాత మరొకరిని ఎలా ఎక్కించుకున్నాడో మీరే చూడండి..!
నికోల్ ఎల్కబ్బాస్ అనే 44 ఏళ్ల బ్రిటన్ మహిళ కేన్సర్ పేరుతో ఫండ్ రైజింగ్కు శ్రీకారం చుట్టింది. స్పెయిన్లో అండాశయ కేన్సర్ చికిత్స పొందుతున్నానని, అందుకోసం భారీగా డబ్బులు చెల్లించాలని ఓ కథను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె మాటలను నమ్మిన దాదాపు 700 మంది ఆమెకు రూ.43 లక్షలు పంపించారు. ఆ డబ్బులతో నికోల్ జల్సా చేసింది. విహార యాత్రల కోసం ఖర్చు పెట్టేసింది. ఆ తర్వాత ఆమె భండారం బయటపడింది. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది.
భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును విచారించిన కోర్టు ఆమెకు రెండు సంవత్సరాల తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. అయితే వసూలు చేసిన సొమ్ము తిరిగి చెల్లించే సామర్థ్యం నికోల్కు లేదని తేలడంతో కేవలం రూ.500 మాత్రమే ఆమెకు జరిమానా పడింది.