సాధారణంగా బైక్ మీద ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ప్రయాణించగలరు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఒక బైక్‌పై ఏకంగా ఏడుగురు ఎక్కి ప్రయాణించారు. ఆ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్ నడిపే వ్యక్తికి ముందు ట్యాంక్‌పై ఇద్దరు పిల్లలు, వెనుక ఇద్దరు మహిళలు కూర్చున్నారు. వారి ఒడిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
అది బైకా? ఆటోనా? అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. కాగా, ఈ వీడియో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు అద్దం పడుతోందని, ధరల భారం భరించలేక సామాన్యులు ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నారని ఎక్కువ మంది కామెంట్లు చేశారు. ఇలాంటి వారి వల్లే రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి