అమ్మా.. నాన్నా.. ఓ అంకుల్.. భయంతో అల్మారాలో దాక్కున్నానంటూ 7 ఏళ్ల పిల్లాడు చెప్పిన మర్డర్ మిస్టరీ..!

ABN , First Publish Date - 2022-04-12T19:08:47+05:30 IST

మన అనుకున్న వారికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తట్టుకోలేం.. అలాంటిది మన ఇంట్లోని వారికి, అందులోనూ తల్లిదండ్రులకు అపాయం కలిగితే ఆ బాధ ఎలా ఉంటుందో..

అమ్మా.. నాన్నా.. ఓ అంకుల్.. భయంతో అల్మారాలో దాక్కున్నానంటూ 7 ఏళ్ల పిల్లాడు చెప్పిన మర్డర్ మిస్టరీ..!

మన అనుకున్న వారికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తట్టుకోలేం.. అలాంటిది మన ఇంట్లోని వారికి, అందులోనూ తల్లిదండ్రులకు అపాయం కలిగితే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మన కళ్ల ముందే తల్లిదండ్రులకు జరగరానిది ఏమన్నా జరిగితే.. ఇక ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మధ్యప్రదేశ్‍‌లో తాజాగా చోటు చేసుకున్న ఘటన.. తీవ్ర సంచలనం కలిగించింది. వివాహేతర సంబంధం వల్ల తల్లిదండ్రుల మధ్య రోజూ గొడవలు. దీనికి తోడు సడన్‌గా ఓ రోజు ఓ అంకుల్ ఇంట్లోకి వచ్చి తల్లిని కొడుతోంటే భయంతో అల్మారాలో దాక్కున్నానంటూ ఓ ఏళ్ల పిల్లాడు చెప్పిన మర్డర్ మిస్టరీ విని అంతా షాక్ అయ్యారు... అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్ జిల్లాలోని సర్నిలో రుబీనా(26) అనే మహిళ భర్త ఆసిఫ్, ఏడేళ్ల కొడుకుతో కలిసి జీవిస్తోంది. భర్త పని నిమిత్తం ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికి వచ్చేవాడు. దీంతో రుబీనా కొడుకుతో కలిసి ఇంట్లోనే ఉండేది. అయితే ఈ క్రమంలో సందీప్‌ అనే వ్యక్తి రుబీనాకు రెండేళ్ల క్రితం పరిచయమయ్యాడు. క్రమంగా వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్తకు తెలిసి.. రుబీనాను మందలించాడు. అలాగే సందీప్‌తో కూడా గొడవ పెట్టుకున్నాడు. అయితే సందీప్ మాత్రం రోజూ రుబీనాను చూసేందుకు ప్రయత్నించేవాడు. భర్తకు తెలిసినప్పటి నుంచి సందీప్‌ను రుబీనా దూరం పెట్టింది. దీంతో సందీప్ ఆమెపై తీవ్రమైన కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలని రోజూ ప్రయత్నాలు చేసేవాడు.

కింద పడటం వల్ల గాయాలయ్యాయని డాక్టర్‌తో అబద్ధం చెప్పిన 84 ఏళ్ల వృద్ధురాలు.. కానీ అసలు నిజమేంటంటే..


సోమవారం మధ్యాహ్నం రుబీనా ఇంట్లోకి సందీప్ ప్రవేశించాడు. ఒక్కసారిగా కత్తి బయటికి తీసి రుబీనాపై దాడి చేయడం మొదలు పెట్టాడు. దీంతో భయపడిపోయిన ఆ ఏడేళ్ల బాలుడు పరుగెత్తుకుంటూ వెళ్లి అల్మారాలో దాక్కున్నాడు. ఆ అల్మారాలో ఉండే గదిలో జరిగిది కళ్లారా చూశాడు. తల్లితో అతడు గొడవ పడుతుండటం, ఆమెను చిత్రవధ చేస్తుండటం, కత్తి తీసుకుని పొడుస్తూ ఉండటం.. అన్నీ కళ్లారా చూశాడు. బయటకు వచ్చినా, అరిచి కేకలు పెట్టినా తనను కూడా చంపేస్తారని ఆ బాలుడు భయపడిపోయాడు. అతడు వెళ్లిపోయినా ఆ బాలుడు మాత్రం ఎంతసేపటికీ అల్మారా నుంచి బయటకు రాలేదు. రుబీనా అరుపులు కేకలు విన్న స్థానికులు ఆ ఇంట్లోకి వచ్చారు. అప్పటికే అతడు వెళ్లిపోగా.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పక్కింటి వాళ్లు వచ్చింది చూసిన ఆ పిల్లాడికి కాస్త ధైర్యం వచ్చింది. అల్మారాలోంచి బయటకు వచ్చి.. అసలు ఏం జరిగిందన్ని వాళ్లకు పూసగుచ్చినట్టు చెప్పాడు. ‘అమ్మ చాలా ఏడ్చింది. బతిమిలాడింది. ఆ అంకుల్ వినలేదు. కత్తితో 16 సార్లు పొడిచాడు. అమ్మ కింద పడిపోగానే వెళ్లిపోయాడు. నాకు భయం వేసి నేను బయటకు రాలేదు. వస్తే నన్ను కూడా చంపేసేవాడు’ అంటూ ఏడుస్తూ ఆ బాబు చెప్పింది విన్న స్థానికులు కంటతడిపెట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న రుబీనాను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. సందీప్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

యూట్యూబ్‌లో డాక్టర్ చూస్తున్న వీడియోలేంటో తెలిసి నివ్వెరపోయిన పేషెంట్.. మొబైల్‌లో రికార్డ్ చేసి..

Updated Date - 2022-04-12T19:08:47+05:30 IST