-
-
Home » Prathyekam » Everyone is shocked to know about the young woman who got married three times in the same month In Rajasthan kjr spl-MRGS-Prathyekam
-
పది రోజులకో పెళ్లి.. ఒక్క నెలలోనే ముగ్గురితో వివాహం.. ఈ యువతి నిర్వాకం తెలిసి నివ్వెరపోతున్న భర్తలు..!
ABN , First Publish Date - 2022-07-15T23:21:13+05:30 IST
భారతీయ వివాహ వ్యవస్థను చాలా దేశాల వారు ఆదర్శంగా తీసుకుంటుంటారు. కానీ మన దేశంలో కొందరు మాత్రం.. పెళ్లి పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. తద్వారా...

భారతీయ వివాహ వ్యవస్థను చాలా దేశాల వారు ఆదర్శంగా తీసుకుంటుంటారు. కానీ మన దేశంలో కొందరు మాత్రం.. పెళ్లి పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. తద్వారా దాంపత్య జీవితాన్ని అపహాస్యం చేస్తుంటారు. తాజాగా రాజస్థాన్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. పది రోజులకు ఒక పెళ్లి చేసుకున్న యువతి.. ఒకే ఒక్క నెలలో ముగ్గురిని వివాహం చేసుకుంది. చివరకు ఆమె నిర్వాకం తెలుసుకుని భర్తలంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం హనుమాన్‌గఢ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేతారణ గ్రామానికి చెందిన నేకి రామ్ అనే యువకుడు ఇటీవల పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి కమలేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన ముస్లిం యువతి ఉందని, ఆమెతో సంబంధం ఖాయం చేస్తానని, అయితే అందుకు బదులుగా రూ.50,000లు అందజేయాలని షరతు పెట్టాడు. పెళ్లి ఆలస్యమవుతుండడంతో చేసేదేమీ లేక నేకి రామ్.. ఆ షరతుకు ఒప్పుకొన్నాడు. తర్వాత షబ్నమ్ అనే యువతిని పరిచయం చేశాడు. మే 13న నేకి రామ్‌ను కోర్టు వద్దకు తీసుకెళ్లి, రూ.500ల స్టాంపుపై వివాహానికి సంబంధించిన అగ్రిమెంట్ రాసుకున్నారు.
వయసు మీద పడుతున్నా ఆ ఊళ్లోని అబ్బాయిలకు పెళ్లే కావడం లేదట.. అసలు సంబంధాలే రాకపోవడం వెనుక..!

వివాహం అనంతరం షబ్నమ్‌ను తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే 6రోజుల తర్వాత కమలేష్ అక్కడికి వెళ్లి.. అర్జంట్ పనుందంటూ షబ్నమ్‌ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తర్వాత ఎంతకీ ఇంటికి రాకపోవడం, ఫోన్లలో కూడా అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కమలేష్, షబ్నమ్ కలిసి పెళ్లి పేరుతో నాటకం ఆడారని తెలిసింది. ఒకే నెలలలో ముగ్గురితో వివాహం చేయించి, లక్షల రూపాయలు దండుకున్నారని తేలింది. ఈ విషయం బయటపడడంతో మోసపోయిన వారంతా అవాక్కయ్యారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
కూతుర్ని డాక్టర్‌ను చెయ్.. ఆర్మీకి మాత్రం పంపకు.. అంటూ భార్యకు చివరి వీడియో.. ఓ సైనికుడి ఆత్మహత్య కేసులో..
