PAIN RELIEF: మందు లేకుండానే నొప్పి నయం.. ఎలాగో తెలుసా..?

ABN , First Publish Date - 2022-07-10T21:52:02+05:30 IST

దీర్ఘకాలిక నొప్పులతో బాధుపడుతున్న వారికి గుడ్‌న్యూస్. గతంలో దెబ్బలు తగిలి లేదా.. ఇతరత్రా నొప్పులతో బాధపడుతున్న వారికోసం అమెరికాలోని ఇల్లినాయిస్‌ లోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ..

PAIN RELIEF: మందు లేకుండానే నొప్పి నయం.. ఎలాగో తెలుసా..?

దీర్ఘకాలిక నొప్పులతో బాధుపడుతున్న వారికి గుడ్‌న్యూస్. గతంలో దెబ్బలు తగిలి లేదా.. ఇతరత్రా నొప్పులతో బాధపడుతున్న వారికోసం అమెరికాలోని ఇల్లినాయిస్‌ లోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త పరికరాన్ని రూపొందించారు. నొప్పి ఉన్న చోట ఈ డివైజ్ ను ఒక క్రమ పద్ధతిలో ప్యాచ్ లా అతికించుకుంటే చాలు.. నొప్పి దానంతటే అదే తగ్గిపోతుంది. సాధారణంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, అనారోగ్యం తలెత్తినప్పుడు.. సదరు శరీర భాగాల్లోని నాడులు స్పందించి మెదడుకు సంకేతాలు పంపుతాయి.


దీంతో ఆయా భాగాల్లో నొప్పి ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. తాజాగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరికరం.. మన చర్మం, దిగువన కండరాల్లోని నాడులను చల్లబర్చడం ద్వారా వాటి నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలను నియంత్రిస్తుంది. దీనివల్ల ఆ నాడి తాత్కాలికంగా మొద్దుబారినట్టు అవుతుంది. దాంతో నొప్పి ఉన్న అనుభూతి ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఈ డివైజ్‌ ఎలా పనిచేస్తుదంటే .. ఐదు మిల్లీమీటర్ల వెడల్పుతో పట్టీలా ఉండే ఈ పరికరంలో అత్యంత సన్నని గొట్టాల వంటి సూక్ష్మ నాళికలు ఉంటాయి.

TALIBAN: తాలిబన్ల కారును ఇన్నేళ్లకు తవ్వి తీశారు.. అసలు ఏం జరిగిందంటే..


దీనికి అనుసంధానించిన పంపు ద్వారా చల్లబర్చిన పర్ ఫ్లోరో పెంటేన్ అనే రసాయనాన్ని, నైట్రోజన్‌ను పంపుతారు. ఈ ద్రవాలు సూక్ష్మ నాళికల ద్వారా ప్రయాణించి నాడులను చల్లబరుస్తాయి. అయితే నొప్పిని తాత్కాలికంగా తగ్గించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుందని.. నొప్పి పూర్తిగా తగ్గిపోవాలంటే మాత్రం చికిత్స తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Kitchen: వంట గది సింక్ నుంచి వింత శబ్ధాలు.. భయం భయంగానే వెళ్లి చూస్తే.. షాకింగ్ సీన్..



Updated Date - 2022-07-10T21:52:02+05:30 IST