TALIBAN: తాలిబన్ల కారును ఇన్నేళ్లకు తవ్వి తీశారు.. అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-10T21:13:30+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన సాగుతున్న సమయంలో అమెరికా ఆర్మీ దాడి చేసింది. 9/11 దాడులను ఎదుర్కోలేకపోయిన ఉగ్రనేతలు.. ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ బార్డర్‌లో తలదాచుకున్నారు...

TALIBAN: తాలిబన్ల కారును ఇన్నేళ్లకు తవ్వి తీశారు.. అసలు ఏం జరిగిందంటే..

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన సాగుతున్న సమయంలో అమెరికా ఆర్మీ దాడి చేసింది. 9/11 దాడులను ఎదుర్కోలేకపోయిన ఉగ్రనేతలు.. ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ బార్డర్‌లో తలదాచుకున్నారు. వారిని బయటికి వారిని బయటికి తీసుకురావాలని తాలిబన్ల అగ్రనేతలను కోరింది. వారు అందుకు నిరాకరించడంతో వారిపైన కూడా దాడులు చేశాయి అమెరికా సైన్యం.. ఈ దాడుల్లో విజయం సాధించిన అమెరికా సైన్యం.. తాలిబన్ ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు అమెరికా దళాల నుంచి తప్పించుకునేందుకు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ ఓ టయోటా కరొల్లా కారును ఉపయోగించాడు.


అమెరికా దాడులు తీవ్రతరం కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో తనకు ఇష్టమైన తెల్లరంగు టయోటా కారును 2001లో జబూల్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో పూడ్చివేశారు. ఆ కారును అలాగే వదిలేస్తే దాన్ని కోల్పోతామేమోనని భారీ గొయ్యి తీసి అందులో పూడ్చి పెట్టాడు. మళ్లీ ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల వశం అవడంతో అన్నింటిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ గొయ్యిలో పూడ్చి పెట్టిన కారును తాలిబన్లు తవ్వి తీశారు.

Kitchen: వంట గది సింక్ నుంచి వింత శబ్ధాలు.. భయం భయంగానే వెళ్లి చూస్తే.. షాకింగ్ సీన్..


ఆ కారు ముందు భాగం కొంచెం దెబ్బతినడం మినహా.. ఇప్పటికీ ఆ కారు మంచి కండిషన్‌లోనే ఉందని తాలిబన్లు తెలిపారు. ఆఫ్ఘాన్‌ రాజధాని అయిన కాబూల్‌లో ఓ మ్యూజియంలో ప్రదర్శిస్తామన్నారు. కాగా... 2013లో ముల్లా ఒమర్ ఓ స్థావరంలో దాగి ఉండగా, అమెరికా సైన్యం అతడిని మట్టుబెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన మృతిని తాలిబన్లు అనేక సంవత్సరాలు పాటు బయటి  ప్రపంచానికి తెలియనివ్వలేదు.

NASA: నాసా శాస్త్రవేత్తల వింత ఆచారం.. రాకెట్ ప్రయోగానికి ముందు అవి తిని తీరాల్సిందేనట.. లేదంటే..



Updated Date - 2022-07-10T21:13:30+05:30 IST