Lock Bomb అంటూ భయపడిపోయిన జనం.. ముట్టుకుంటే పేలుతుందేమోనని టెన్షన్.. చివరకు ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2022-12-20T18:01:17+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఓ డిజిటల్ లాక్ (Digital Lock) కలకలం రేపింది. డిజిటల్ లాక్‌ను `లాక్‌ బాంబు`గా (Lock Bomb) భావించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ పోలీసులు (Delhi Police), బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని డిజిటల్ లాక్‌ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

Lock Bomb అంటూ భయపడిపోయిన జనం.. ముట్టుకుంటే పేలుతుందేమోనని టెన్షన్.. చివరకు ఏం తేలిందంటే..

దేశ రాజధాని ఢిల్లీలో ఓ డిజిటల్ లాక్ (Digital Lock) కలకలం రేపింది. డిజిటల్ లాక్‌ను లాక్‌ బాంబుగా (Lock Bomb) భావించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు (Delhi Police), బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని డిజిటల్ లాక్‌ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral News) అయింది. నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లతో ఢిల్లీ పోలీసులను ఎగతాళి చేస్తున్నారు.

ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో దొరికిన ఆ అనుమానాస్పద వస్తువును పోలీసులు డిజిటల్ లాక్‌గా పోలీసులు తేల్చారు. అది కంటైనర్లకు తాళం వేయడానికి ఉపయోగించే డిజిటల్ తాళం అని, అందులో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని దర్యాప్తులో తేలింది. ఈ డిజిటల్ లాక్ ఫోటో ట్విటర్‌లో వైరల్ అయినప్పటి నుంచి నెటిజన్లు ట్రోలింగ్‌కు (Trolling) దిగారు. ఒక వ్యక్తి ఆ ఫోటోను షేర్ చేసి, మీరు పోలీసులు ఎలా అయ్యారు అని ప్రశ్నించాడు. మరో వ్యక్తి.. 'డిజిటల్ లాక్‌ను బాంబుగా పరిగణిస్తున్నారా?' అని కామెంట్ చేశాడు.

Updated Date - 2022-12-20T18:01:19+05:30 IST