19 ఏళ్ల కుర్రాడి దారుణం.. మొదట పెట్రోల్ తాగి.. ఆ తర్వాత కాలేజీలో నాలుగో అంతస్తుకు వెళ్లి మరీ..

ABN , First Publish Date - 2022-08-13T21:15:23+05:30 IST

ఆ యువకుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.. ఏం కష్టమొచ్చిందో ఏమో శుక్రవారం ఉదయం ఘాతుకానికి

19 ఏళ్ల కుర్రాడి దారుణం.. మొదట పెట్రోల్ తాగి.. ఆ తర్వాత కాలేజీలో నాలుగో అంతస్తుకు వెళ్లి మరీ..

ఆ యువకుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.. ఏం కష్టమొచ్చిందో ఏమో శుక్రవారం ఉదయం ఘాతుకానికి పాల్పడ్డాడు.. కాలేజీ ఆవరణలో పెట్రోల్ తాగేసి నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు.. తీవ్ర గాయాల పాలైన అతడు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉన్నప్పటికీ.. ఉపాధ్యాయుల నిర్వాకం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌ (Nagpur)లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Pani Puri: ప్రాణాల మీదకు తెచ్చిన పానీపూరీ.. వంద మందికి అస్వస్థత!


శివమ్ కటారే అనే యువకుడు నాగ్‌పూర్‌లోని ఎస్‌ఎఫ్‌ఎస్ కాలేజీలో బీసీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కాలేజీ ప్రాంగణంలో పెట్రోల్ తాగేసిన శివమ్ బిల్డింగ్ నాలుగో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకేశాడు. కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే ఎవరి వాహనంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లాలనే విషయంలో వాదులాడుకుంటూ ఉపాధ్యాయులు కాలయాపన చేయడం వల్ల అతడికి సకాలంలో చికిత్స అందలేదు. 


హాస్పిటల్‌కు తీసుకెళ్లే సమయానికే శివమ్ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. శివమ్ ఆత్మహత్యకు కారణాలేంటనేవి ఇంకా బయటకు రాలేదు. పోలీసులు కాలేజీ సిబ్బందిని, శివమ్ క్లాస్‌మేట్స్‌ను విచారిస్తున్నారు. 

Updated Date - 2022-08-13T21:15:23+05:30 IST