Pani Puri: ప్రాణాల మీదకు తెచ్చిన పానీపూరీ.. వంద మందికి అస్వస్థత!

ABN , First Publish Date - 2022-08-13T01:25:19+05:30 IST

తక్కువ ఖర్చు, ఎక్కువ రుచి కలిగి ఉండే పానీపూరీని ఇష్టపడని వారుండరు

Pani Puri: ప్రాణాల మీదకు తెచ్చిన పానీపూరీ.. వంద మందికి అస్వస్థత!

తక్కువ ఖర్చు, ఎక్కువ రుచి కలిగి ఉండే పానీపూరీని ఇష్టపడని వారుండరు. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ వీధుల్లో దొరికే పానీపూరీని (pani puri) ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే పానీపూరీని విక్రయించే వారు శుభ్రతను పాటించకపోవడం తీవ్ర అనారోగ్యాలకు కూడా కారణమవుతుంటుంది. తాజాగా పానీపూరీ తిన్న వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


ఇది కూడా చదవండి..

Swiggy delivery Agent: ఆర్డర్ ఎంత సేపటికీ రాకపోవడంతో స్వీగ్గీ డెలివరీ బాయ్‌పై ఆగ్రహం.. తీరా అతడిని చూసి షాక్!


హుగ్లీ (Hooghly) జిల్లాలోని సుగంధ గ్రామంలో ఓ వీధి బండి దగ్గర బుధవారం చాలామంది పానీపూరీ తిన్నారు. అక్కడ పానీపూరీ తిన్నవారిలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. అందరూ వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డారు. కొంతమంది పరిస్థితి మరింత విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందికి తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మందులు అందించారు. కొందరిని ఆస్పత్రికి తరలించారు. నీటి కాలుష్యం వల్ల డయేరియా ప్రబలి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.


Updated Date - 2022-08-13T01:25:19+05:30 IST