Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ అయింది

ABN , First Publish Date - 2022-12-05T17:25:16+05:30 IST

ఆ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పుడు మొదలెడతారు అన్న విషయం మీద ఒక క్లారిటీ తేదీ వచ్చింది.

Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ అయింది

అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' సినిమా గురించి తాజా సమాచారం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పుడు మొదలెడతారు అన్న విషయం మీద ఒక క్లారిటీ తేదీ వచ్చింది. (The latest news about Allu Arjun and Sukumar combination 'Pushpa 2' shooting is that they wanted to start from December 17, 18 and 19 in Secunderabad, says a source) పుష్ప రెండో పార్టు షూటింగ్ ఈనెల అంటే డిసెంబర్ 17, 18, 19 మూడరు రోజులపాటి సికింద్రాబాద్ లోని ఒక గవర్నమెంట్ కాలేజీ లో షూటింగ్ జరుగుతుందని తెలిసింది. పుష్ప మొదటి పార్టు లో ఎక్కడ అయితే ఆపారో ఆ తరువాత జరగబోయే సన్నివేశాలు కొన్ని ముందుగా చిత్రీకరించాలని దర్శకుడు సుకుమార్ అనుకున్నట్టుగా తెలిసింది. అలాగే మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ చాల బిజీ గా ఉండటం తో అతని డేట్స్ కుదరటం కూడా చాలా కష్టం అని తెలిసింది. అందువల్ల అతను ఒక మూడు రోజుల పాటు ఈ పుష్ప సినిమా షూటింగ్ కి డేట్స్ ఇచ్చాడని, అందువల్ల అతని సన్నివేశాలను ముందుగా మొదలెడుతున్నారని తెలిసింది. (Malayalam actor Fahad Fazil is busy with other film, so he allotted three days for Pushpa 2, says the source)

AA-Sukumar.jpg

ఈ మూడు రోజులు తీయబోయే సన్నివేశాలు అన్నీ కాంబినేషన్ వుంటాయని, అందువల్ల కొంతమంది క్యారెక్టర్ నటులు కూడా ఇందులో ఉండొచ్చు అని కూడా తెలిసింది. బ్రహ్మాజీ పార్టు వన్ లో చివర్లో కనిపిస్తాడు, కానీ రెండో పార్టులో అతని పాత్ర కూడా పెద్దగా ఉంటుంది అని, ఈ మూడు రోజులు అతను కూడా ఫహాద్ తో పాటు ఉంటాడని తెలిసింది. అయితే ఎట్టకేలకు పుష్ప రెండో పార్టు షూటింగ్ తేదీలు ఖరారు అయ్యాయి, షూటింగ్ కూడా ఇంకా మొదలెడతారు. ఆ తరువాత షూటింగ్ కంటిన్యూ అవుతుందని, అయితే వేరే దగ్గర ఉంటుందని తెలిసింది. (The shooting is going to take place in a Government college in Secunderabad). ఇందులో రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోంది.

Updated Date - 2022-12-05T17:33:36+05:30 IST